Saturday10 October 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Cinema

कई फिल्म संघों का फिल्म फेडरेशन के खिलाफ प्रदर्शन, वल्लभानेनी अनिल को गिरफ्तार करने की मांग

▪️ Various cine unions rage against Film Federation ▪️ Allegations of massive irregularities in Chitrapuri Housing Society ▪️ Criticism that cine unions are being fragmented ▪️ Stern warning that Vallabhaneni Anil will not be spared

Staff Reporter30 September 2026, 10:46 AM24 व्यूtrinetnews.com
कई फिल्म संघों का फिल्म फेडरेशन के खिलाफ प्रदर्शन, वल्लभानेनी अनिल को गिरफ्तार करने की मांग

Share this story

Share link keeps your language (?lang=)

*ఫిలిం ఫెడరేషన్‌పై భ‌గ్గుమ‌న్న ప‌లు సినీ సంఘాలు*

▪️ *చిత్రపురి హౌసింగ్ సొసైటీలో భారీ అక్రమాల ఆరోపణలు*

▪️ *సినీ యూనియన్లను విచ్ఛిన్నం చేస్తున్నారంటూ విమర్శలు*

▪️ *వ‌ల్ల‌భ‌నేని అనిల్‌ను వ‌దిలిపెట్ట‌బోమంటూ తీవ్ర హెచ్చ‌రిక‌*

▪️ *విచారణ నివేదికలను బయటపెట్టాలని డిమాండ్*

▪️ *ఫిలిం ఛాంబర్‌కు బాధితులు, కార్మిక సంఘాల ప్రతినిధుల వినతిపత్రం*

▪️ *వల్లభనేని అనిల్‌ను జైలులో పెట్టాలి: పాశం యాద‌గిరి డిమాండ్*

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమకు వెన్నెముకగా భావించే 24 క్రాఫ్ట్స్ కార్మిక సంఘాల వ్యవస్థలో అంతర్గత పోరు ర‌చ్చ‌కెక్కింది. ఫిలిం ఫెడరేషన్‌లోని అధికార వ్యవహారశైలి, టాలీవుడ్ ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ (తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్) అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ అక్ర‌మాలు, యూనియన్లలో జోక్యం, ఎన్నికల ప్రక్రియ, కార్మికుల హక్కులు, చిత్రపురి హౌసింగ్ సొసైటీ వ్యవహారాలపై తీవ్ర ఆరోపణలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. ఒకవైపు ఫెడరేషన్‌పై నియంతృత్వ పోకడల ఆరోపణలు వినిపిస్తుండగా.. మరోవైపు చిత్రపురి హౌసింగ్ సొసైటీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, సభ్యత్వాలు, ఇళ్ల కేటాయింపులు, విచారణ నివేదికలపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సినీ కార్మిక సంఘాల ప్రతినిధులు తెలుగు ఫిలిం ఛాంబర్‌ను ఆశ్రయించడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

చిత్రపురి సాధన సమితి నాయకులు, 24 క్రాఫ్ట్స్–చిత్రపురి కాలనీ బాధితుల ప్రతినిధులు, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఫిల్మ్ వింగ్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రతినిధులు, తెలంగాణ సినిమా వేదిక సభ్యులు తదితరులు కలిసి తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అశోక్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఫెడరేషన్‌లో జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్న పరిణామాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని, చిత్రపురి వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.

తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు పాశం యాద‌గిరి మాట్లాడుతూ తీవ్రంగా మండిప‌డ్డారు. ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ అక్ర‌మాల‌పై కేసులు పెట్టి జైలులో పెట్టాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ‌లో ఇలాంటి మోస‌గాళ్ల‌ను వ‌దిలిపెట్ట‌కూడ‌ద‌న్నారు.

*‘24 క్రాఫ్ట్స్‌ను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం’*

డైరెక్టర్స్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ మద్దినేని రమేష్ చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారాన్ని మరింత తీవ్రంగా మార్చాయి. 24 కార్మిక సంఘాలతో కూడిన ఫెడరేషన్‌లో ఒక వ్యక్తి ఆధిపత్యం పెరుగుతోందని ఆయన ఆరోపించారు. డ్యాన్సర్స్ యూనియన్, మహిళా వర్కర్స్ యూనియన్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ మేనేజర్స్ యూనియన్ వంటి పలు సంఘాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, వాటిలో విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఫెడరేషన్ ఎన్నికలు, యూనియన్ ఎన్నికల సమయంలో డబ్బు, ఓట్ల వ్యవహారం జరుగుతోందని ఆయన ఆరోపించారు. తనకు అనుకూలంగా లేని వర్గాలను బలహీనపరిచి, అనుకూల వ్యక్తులను వివిధ సంఘాల్లోకి తీసుకురావడం ద్వారా మొత్తం ఫెడరేషన్‌ను ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు.

*‘ఫెడరేషన్‌కు 26 వేల మంది కార్మికులు.. నిర్ణయాలు కొందరి చేతుల్లోనా?’*

24 క్రాఫ్ట్స్‌లో సుమారు 26 వేల మంది కార్మికుల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని ప్రతినిధులు పేర్కొన్నారు. ఇంత పెద్ద వ్యవస్థలో ప్రజాస్వామ్యబద్ధమైన విధానం, యూనియన్ల స్వతంత్రత, కార్మికుల హక్కులు కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఫెడరేషన్ నాయకత్వం అన్ని యూనియన్లను సమన్వయం చేయాల్సి ఉండగా, విభేదాలు సృష్టించడం, ప్రత్యర్థి వర్గాలతో చేతులు కలపడం, బైలాస్‌కు విరుద్ధంగా వ్యవహరించడం వంటి ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి.

*చిత్రపురిపై రూ.110 కోట్ల స్కామ్ ఆరోపణలు!*

చిత్రపురి సాధన సమితి ప్రతినిధి కస్తూరి శ్రీనివాస్ చిత్రపురి హౌసింగ్ సొసైటీ వ్యవహారాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో జరిగిన విచారణ నివేదికల్లో సుమారు రూ.110 కోట్ల మేర ఆర్థిక అవకతవకలు జరిగినట్లు పేర్కొన్నారని ఆయన తెలిపారు. 2020–2025 కాలానికి సంబంధించి మరో విచారణ నివేదిక కూడా సిద్ధమైందని, అందులోని వివరాలను పూర్తిగా బహిర్గతం చేయలేదని ఆరోపించారు. విచారణ నివేదిక బయటకు వచ్చిన తర్వాత నిర్దిష్ట కాలవ్యవధిలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ అది జరగలేదని పేర్కొన్నారు. అయితే ఈ రూ.110 కోట్లకు సంబంధించిన ఆరోపణలు సంబంధిత విచారణ పత్రాలు, అధికారిక నివేదికల ఆధారంగా స్వతంత్రంగా నిర్ధారించాల్సి ఉంది.

*సభ్యత్వాలు.. ఓటర్ల జాబితాపైనా తీవ్ర ఆరోపణలు*

చిత్రపురి హౌసింగ్ సొసైటీలో సభ్యత్వాలు, ఓటర్ల జాబితా, ఇళ్ల కేటాయింపులు, రిజిస్ట్రేషన్ల విషయంలో కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సుమారు 1,300 మంది నాన్-మెంబర్ల అంశాన్ని గత న్యాయపరమైన వ్యవహారాలతో ముడిపెట్టి కస్తూరి శ్రీనివాస్ ప్రశ్నించారు. అర్హత, సభ్యత్వం, కేటాయింపు ప్రక్రియపై పూర్తిస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాతే రిజిస్ట్రేషన్లు, ఇళ్ల కేటాయింపులు జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

*డ్యాన్సర్స్ యూనియన్ వివాదం కూడా ముదిరింది*

ఇదే సమయంలో డ్యాన్సర్స్ యూనియన్ వ్యవహారం కూడా వివాదానికి కేంద్రంగా మారింది. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవి ఫిలిం ఫెడరేషన్ వైఖరిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్, కార్యదర్శి రాయపల్లి ప్రసాద్‌లు తమ యూనియన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. యూనియన్‌లో జరుగుతున్నాయని తాము ఆరోపిస్తున్న అవకతవకలను ప్రశ్నించినందుకే తమపై కక్షసాధింపు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన తనను ప్రశాంతంగా పనిచేయనివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. జానీ మాస్టర్‌పై విధించిన నాన్-కోఆపరేషన్/సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కూడా డిమాండ్ చేశారు.

*‘ఫెడరేషన్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’*

ఫెడరేషన్‌లో వ్యక్తిగత ఆధిపత్యం కాకుండా 24 క్రాఫ్ట్స్‌లోని అన్ని సంఘాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతినిధులు కోరారు. యూనియన్ల అంతర్గత సమస్యలను సంబంధిత సంఘాల పరిధిలోనే పరిష్కరించాలని, ఫెడరేషన్ స్థాయిలో పారదర్శక విధానాన్ని పాటించాలని డిమాండ్ చేశారు. ఫిలిం ఛాంబర్, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సినిమాటోగ్రఫీ శాఖ, సహకార శాఖతో పాటు సంబంధిత అధికార సంస్థలు ఈ ఆరోపణలపై సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు కోరారు.

*‘విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయి’*

చిత్రపురి హౌసింగ్ సొసైటీకి సంబంధించిన భూములు, సభ్యత్వాలు, ఓటర్ల జాబితా, ఇళ్ల కేటాయింపులు, రిజిస్ట్రేషన్లు, నిధుల వినియోగం వంటి అంశాలపై సమగ్ర ఆడిట్, విచారణ అవసరమని ప్రతినిధులు పేర్కొన్నారు. తాము అధికారులకు, వివిధ ప్రభుత్వ సంస్థలకు ఇప్పటికే పలు ఫిర్యాదులు, వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. సంబంధిత పత్రాలు, విచారణ నివేదికలు, కోర్టు ఆదేశాలను పరిశీలించి వాస్తవాలను బహిర్గతం చేయాలని కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో చిత్రపురి సాధన సమితి ప్రతినిధి డా. కస్తూరి శ్రీనివాస్, డైరెక్టర్స్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ మద్దినేని రమేష్, తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, సీనియ‌ర్ జ‌ర్నలిస్టు పాశం యాదగిరి, తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవి, ప‌లు సినీ సంఘాల ప్ర‌తినిధులు హేమ జిల్లోజు, కలగారా సుధీర్, భీమ్ రెడ్డి

గుర్రం రాజు, ఉస్మానియా నగేష్, శివ శంకర్ పటేల్, తోట హరిత, తడివేలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

*ఇప్పుడు ఫిలిం ఛాంబర్ నిర్ణయంపైనే దృష్టి*

24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ వ్యవహారం, డ్యాన్సర్స్ యూనియన్ వివాదం, చిత్రపురి హౌసింగ్ సొసైటీ ఆరోపణలు ఒకేసారి తెరపైకి రావడంతో తెలుగు సినీ పరిశ్రమలో ఈ అంశం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. బాధితులు, కార్మిక సంఘాల ప్రతినిధులు సమర్పించిన వినతిపత్రంపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

--

यह भी पढ़ें

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

ఆధునిక సాంకేతిక‌త‌కు పెద్ద పీట వేయాలి కేబీఆర్ చుట్టూ మ‌రింత స‌జావుగా రాక‌పోక‌లు రీసైకిల్డ్ వాట‌ర్ వినియోగంపై పూర్తి స్థాయి అధ్య‌య‌నం క్యూర్ ప‌రిధిలో ప‌నుల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

और पढ़ें →