శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

సాంస్కృతికం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

Staff Reporter6 October 2026, 3:36 PM27 చూసులుtrinetnews.com
గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల నగదు మంజూరు చేస్తున్నారని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యం తో ఆదర్శ ఫౌండేషన్ అర్ ఆర్ ఫౌండేషన్ నిర్వహణలో పద్మ విభూషణ్ అవార్డ్ గ్రహీత డాక్టర్ పి సుశీల లకు పౌర సన్మానం గాయనీ గాయకుల ఆనందోత్సాహాలు మధ్య గాన భరితం గా జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న కోలేటి దామోదర్ మాట్లాడుతూ సుశీల తెలుగు జాతి సంపద అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆమె పాటలు భవిష్యత్ తరాలకు అందేలా నిషిప్తం చేయాలని కోరారు అధ్యక్తత వహించిన సమాచార హక్కు చట్టం పూర్వ ముఖ్య కమిషనర్ పి విజయ బాబు మాట్లాడుతూ సప్త స్వరాలు సుశీల్సిగానం లో పలుకుతాయి అని చెప్పారు గాయని ఆమని పట్ల అభిమానం తో పదహారు సార్లు ఆమె కార్యక్రమాలకు రావటం విశేషం అని తెలిపారు సుశీల మాట్లాడుతూ వృధాప్యం లో వున్న సంగీత కళాకారులు వేరే ఉపాధి వారికి లేదనీ వారికోసం ట్రస్ట్ ప్రారంభించడం జరిగింది కానీ ఆర్థిక వనరులు లేక మూసి వేత లో ఉన్న ట్రస్ట్ ను అమనీ తిరిగి తెరిపించే ప్రయత్నం లో ప్రభుత్వ ఆర్థిక సాయం అందిస్తున్నందుకు ధన్య వాదాలు తెలిపారు వేదిక పై కుసుమ భోగరాజు బి ఎస్ వి వి ఎస్ మూర్తి వెంకటేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు ఆమని చంద్ర తేజ మల్లెల వసుంధర మానస హనుమంత్ రావు తదితరులు సుశీల సుముఖం గానం చేయగా ఆమె తన అభిప్రాయాలు తెలిపి వారిని అభినందించారు

ఇవి కూడా చదవండి

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

ఆధునిక సాంకేతిక‌త‌కు పెద్ద పీట వేయాలి కేబీఆర్ చుట్టూ మ‌రింత స‌జావుగా రాక‌పోక‌లు రీసైకిల్డ్ వాట‌ర్ వినియోగంపై పూర్తి స్థాయి అధ్య‌య‌నం క్యూర్ ప‌రిధిలో ప‌నుల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

మిగతా చదవండి →