శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

సాంస్కృతికం

రేపటి నుంచి ‘ప్రజల బతుకమ్మ–2026’ సంబరాలు

రేపటి నుంచి ‘ప్రజల బతుకమ్మ–2026’ సంబరాలు రవీంద్రభారతిలో ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం అక్టోబరు 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ హైదరాబాద్‌, అక్టోబరు 9 (ట్రైనెట్ న్యూస్): తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘

Staff Reporter9 October 2026, 2:01 PM16 చూసులుtrinetnews.com
రేపటి నుంచి ‘ప్రజల బతుకమ్మ–2026’ సంబరాలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

రేపటి నుంచి ‘ప్రజల బతుకమ్మ–2026’ సంబరాలు

రవీంద్రభారతిలో ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం

అక్టోబరు 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ

హైదరాబాద్‌, అక్టోబరు 9 (ట్రైనెట్ న్యూస్): తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజల బతుకమ్మ–2026’ వేడుకలు అక్టోబరు 10 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. రవీంద్రభారతిలో అక్టోబరు 10న సాయంత్రం 5 గంటలకు ఎంగిలిపూల బతుకమ్మతో సంబరాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 11 నుంచి 17 వరకు ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి రవీంద్రభారతిలో బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేడుకలకు భాషా సాంస్కృతిక శాఖ ఆహ్వానం పలికింది. అక్టోబరు 18న సాయంత్రం 5 గంటలకు సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. అమరవీరుల స్మారకం నుంచి ట్యాంక్‌బండ్ వరకు వేయి బతుకమ్మలతో వేడుకలు, కళారూపాల ప్రదర్శన, అనంతరం బతుకమ్మల నిమజ్జనం జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్‌, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి ఆహ్వాన పత్రం విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

ఆధునిక సాంకేతిక‌త‌కు పెద్ద పీట వేయాలి కేబీఆర్ చుట్టూ మ‌రింత స‌జావుగా రాక‌పోక‌లు రీసైకిల్డ్ వాట‌ర్ వినియోగంపై పూర్తి స్థాయి అధ్య‌య‌నం క్యూర్ ప‌రిధిలో ప‌నుల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

మిగతా చదవండి →