అలరించిన ‘సంకీర్తన స్వర సమ్మేళనం’
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 21: మీనాక్షి గ్రూప్ ఆబాలగోపాలం ఆధ్వర్యంలో ‘సంకీర్తన స్వర సమ్మేళనం చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమంలో అమృత మహాభాష్యం మ్యూజిక్ అకాడమీ (అమ్మ), ఆబాలగోపాలం గాయనీ, గాయకులు పాల్గొని సంకీర్తనలు ఆలపించారు. గాయని, సంగీత దర్శకురాలు అమృత మహాభాష్యంతో పాటు బాల, యువ కళాకారులు గాన ప్రదర్శనలు ఇచ్చారు. వేద ప్రణవ్, వేద కార్తికేయ, అన్న జేష్ణ, నిత్య శ్రీహిత, పి. కార్తికేయ అభిరామ్, విశాల్ ఆర్యన్ బూరెల, సాన్వి, వైష్ణవి ప్రార్థన, గాయత్రి, వైష్ణవి, లహరి, శ్రీనిధి, సారన్యక్షిత, ఎ.వి. అశ్మిత రెడ్డి, ఎన్. జైత్ర, వి. మనస్విని పాల్గొన్నారు. కీబోర్డ కె. రాజేశ్వరరావు, తబలాపై సూర జగన్దత్తు రెడ్డి వాద్య సహకారం అందించారు. జి. శ్రీనివాస్ కుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మీనాక్షి గ్రూప్ ఆబాలగోపాలం వ్యవస్థాపకురాలు తనికెళ్ల సూర్య మీనాక్షి సమన్వయం చేశారు.





