శనివారం10 అక్టోబర్ 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

సాంస్కృతికం

శంకర నారాయణ 'లయన్స్ శతకం' ఆవిష్కరణ

శంకర నారాయణ సంపుటి లయన్స్ శతకం ఆవిష్కరణ హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 28: ప్రముఖ జర్నలిస్ట్ హాస్యావధాని శంకర నారాయణ రచించిన మరో శతకం లయన్స్ శతకం సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం శ్రీ త్యాగరాయ గానసభ లోని క

Staff Reporter28 September 2026, 2:36 PM8 చూసులుtrinetnews.com
శంకర నారాయణ 'లయన్స్ శతకం' ఆవిష్కరణ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

శంకర నారాయణ సంపుటి లయన్స్ శతకం ఆవిష్కరణ

హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 28: ప్రముఖ జర్నలిస్ట్ హాస్యావధాని శంకర నారాయణ రచించిన మరో శతకం లయన్స్ శతకం సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం శ్రీ త్యాగరాయ గానసభ లోని కళా సుబ్బారావు కళా వేదిక పై గాన సభ నిర్వహణలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యం తో జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న గాన సభ అధ్యక్షుడు కళా జనార్థన మూర్తి సంపుటిని ఆవిష్కరించి మాట్లాడారు శంకర నారాయణ ప్రముఖ దిన పత్రికలు లో జర్నలిస్ట్ గా భాధ్యతలను నిర్వహించి విశ్రాంత జీవనం లో సాహిత్య ప్రక్రియలు చేపట్టి సమాజానికి తన ఆలోచనలు అందిస్తున్నారు అని అభినందించారు లయన్స్ శతకం లో లయన్స్ క్లబ్ వారు చేస్తున్న సామాజిక సేవ కార్యక్రమాల గురించి పద్య ప్రక్రియలో అందించారనీ వివ రించారు ఇప్పటికీ ఏభై శతకాలు వివిధ అంశాలు ప్రధానం గా భక్తి ఆధ్యాత్మిక విషయాలు పై రాశారు అని గుర్తు చేశారు శంకర నారాయణ సంపుటిని లాంఛనం గా ప్రముఖ దంత వైద్యులు చంద్ర కాంత్ పద్మజ దంపతులకు అంకిత మిచ్చారు డాక్టర్ చంద్ర కాంత్ మాట్లాడుతూ శంకర నారాయణ ఏ అంశం తీసుకున్నా స్పష్టత తో సులభ శైలి లో పాఠకులు కు అందించగల ప్రజ్ఞ కల వారు అని కొని యాడారు గతం లో ఆయన తమకు రెండు శతకాలు అంకితం చేసిన విషయం గుర్తు చేసుకున్నారు సెన్సార్ బోర్డు సభ్యుడు బుచ్చి రామ్ మాట్లాడుతూ శంకర నారాయణ సామాజిక అంశాలు వస్తువు గా తీసుకుని రచనలు చేయాలి అని కోరారు శంకర నారాయణ మాట్లాడుతూ తన లక్ష్యం శత శతకాలు వివిధ అంశాలు పై రాయటమే నని తెలిపారు డాక్టర్ కేతరాజు కామేశ్వర రావు అతిథిగా పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

ఆధునిక సాంకేతిక‌త‌కు పెద్ద పీట వేయాలి కేబీఆర్ చుట్టూ మ‌రింత స‌జావుగా రాక‌పోక‌లు రీసైకిల్డ్ వాట‌ర్ వినియోగంపై పూర్తి స్థాయి అధ్య‌య‌నం క్యూర్ ప‌రిధిలో ప‌నుల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

మిగతా చదవండి →