Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Editorial

क्रोध पर नियंत्रण... शब्दों में संयम... जीवन में विजय!

क्रोध पर नियंत्रण शब्दों में संयम ट्राइनेट न्यूज की विशेष रिपोर्ट: एक व्यक्ति आने वाले कल के क्रिकेट मैच के लिए कई दिनों से मेहनत कर रहा था। उसने बहुत अच्छी प्रैक्टिस की थी। ठीक मैच शुरू होने के बाद...

Staff Reporter25 September 2026, 3:09 PM31 व्यूtrinetnews.com
क्रोध पर नियंत्रण... शब्दों में संयम... जीवन में विजय!

Share this story

Share link keeps your language (?lang=)

*ఆవేశంలో అదుపు*

*మాటల్లో పొదుపు*

ట్రైనెట్ న్యూస్ ప్రత్యేక కథనం: ఒక వ్యక్తి మరుసటి రోజు జరగబోయే క్రికెట్ మ్యాచ్ కోసం చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాడు. చాలా బాగా ప్రాక్టీస్ చేశాడు. సరిగ్గా మ్యాచ్ ప్రారంభమైన తర్వాత బ్యాటింగ్ చేయడం కోసం బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లోకి దిగగానే ఆటలో అతని ప్రత్యర్థి వర్గం వాళ్లు ఒక కొత్త వ్యక్తిని బౌలర్ గా దించడం జరిగింది. ఇతనికి ఆ బౌలర్ యొక్క బంతి వేసే స్వభావం గురించి ముందుగా ఒక అవగాహన లేకపోవడం వలన సరిగ్గా పరుగులు చేయలేకపోతున్నాడు.

ఇది గమనించిన ప్రేక్షకుల్లో ఒక వ్యక్తి "మ్యాచ్ ఆడడం రానప్పుడు ఎందుకు రావాలి? మీకు పరుగులు తీయడం చేతకాదా?" అంటూ అరవడం మొదలుపెట్టాడు. ఆ మాటలు వినపడిన ఈ వ్యక్తికి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు అతని ముందు రెండు మార్గాలు ఉన్నాయి.

*మొదటిది:* ఆ బ్యాట్ ని పక్కనపెట్టి, విమర్శించిన ఆ వ్యక్తి దగ్గరికి నేరుగా వెళ్లి "నేను ఈ మ్యాచ్ కోసం ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నానో తెలుసా నీకు? కనీసం ఆడడమైనా వచ్చా నీకు? నువ్వు ఎప్పుడైనా క్రికెట్ ఆడావా? నా బ్యాటింగ్ గురించి విమర్శించే హక్కు నీకు ఎవరు ఇచ్చారు?" అంటూ అతనితో వాదనకు దిగవచ్చు.

*రెండవది:* నిజంగానే తను ప్రేక్షకులు ఆశించినంతగా పరుగులు తీయలేకపోవడం వల్లనే అతడు విమర్శించాడు కదా అని అర్థం చేసుకొని మరుసటి మ్యాచ్ కోసం మరింత శ్రద్ధగా, మరింత చాకచక్యంగా ప్రాక్టీస్ చేయడం ద్వారా తదుపరి పోటీల్లో ప్రేక్షకులు ఊహించిన దానికన్నా ఎక్కువ పరుగులు చేసి తనేంటో నిరూపించుకోవచ్చు.

ఇక్కడ మొదటిది ఆవేశంతో కూడుకున్న పని. రెండవది ఆలోచనతో కూడుకున్న పని. ఎదుటి వారు చేసే ప్రతి విమర్శకూ మనం సమాధానం చెప్పనవసరం లేదు. ఆ విమర్శ నిజంగా మన మంచి కోరి లేదా మన ఎదుగుదల కోరి, మనం మరింతగా రాణించేలా దోహదపడే విమర్శనా లేక మన మీద ద్వేషంతోనో, అసూయతోనో, మనల్ని బాధపెట్టేందుకు చేసే విమర్శనా అనేది ఒక్కసారి ఆలోచించాలి.

నిజంగా మన మేలుకోరి చేసే సద్విమర్శ అయితే అందులో మన వల్ల జరిగిన తప్పేంటో అర్థం చేసుకొని మరోసారి అలా జరగకుండా చూసుకోవాలి.

ఒకవేళ మన మనసు నొచ్చుకోడానికే అవతలి వాళ్ళు విమర్శలు చేసినట్లయితే, మన వృత్తిపట్ల మరింత నిబద్ధతతో, ఒక ప్రణాళికతో ఏదైనా ఒక విజయం సాధించి, వారి విమర్శలకు సమాధానంగా అందించాలి. అంతేగాని మనం మంచి వారమని గానీ, మనం బాగానే పనిచేస్తున్నామని గానీ, ఎదుటివారిని భయపెట్టో, బెదిరించో మనం వారిని ఒప్పించలేము.

కాబట్టి మన ఆవేశం అదుపులో ఉండి మాట పొదుపుగా ఉంటే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. మనల్ని రెచ్చగొట్టేలా ఎదుటివారు చేసే విమర్శలకు మనం స్పందిస్తూ పోతే వారి ఉచ్చులో పడిపోతాము ఇక ఎప్పటికీ వారి విమర్శలు ఆగవు, మన సమాధానాలు ఆగవు. విమర్శ చేసే వ్యక్తి, అతని ప్రవర్తన, విమర్శ చేసిన సందర్భం, సమయం అన్నింటిని బట్టి మనం ఎలా స్పందించాలో ఒక నిర్ణయానికి వచ్చిన తరువాతే స్పందించాలి.

*చివరగా ఒక్క మాట:*

క్రికెట్లో ఆట ఆడే వాళ్ళు టీంలో 11 మంది ఉంటారు, చూసే ప్రేక్షకులు మాత్రం వేళల్లో ఉండొచ్చు. వారికి నచ్చినపుడు ప్రశంసిస్తారు, ఆట నచ్చనప్పుడు విమర్శిస్తారు, కానీ వాళ్ళు ఎప్పుడూ ప్రేక్షకులు మాత్రమే ఆటగాళ్లు కాదు. అలాగే మన జీవితం కూడా ఒక ఆటనే. ఏ వ్యక్తి అయిన పూర్తిగా అన్నీ నేర్చుకునే ఈ భూమి మీదకు రాడు. ఒక్కొక్కటీ నేర్చుకుంటూ జీవిస్తాము. నచ్చిన వాళ్ళు మెచ్చుకుంటారు, నచ్చని వాళ్ళు విమర్శిస్తారు.

దేవుడు సృష్టించిన ఈ మనుషుల్లోనే ఒక్కొక్కరూ ఒక్కో దేవుణ్ణి ఇష్టపడతారు. అలాంటిది మనం మామూలు మనుషులం, మనమంటే నచ్చని వాళ్ళు ఉండడం సహజం. ఎందుకంటే అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు, అందరూ పెరిగిన వాతావరణం ఒకే విధంగా ఉండకపోవచ్చు. కాబట్టి "నన్నే విమర్శిస్తున్నారు,నన్నే ఎందుకు ఇలా అంటున్నారు, నాకే ఇలా ఎందుకు జరిగింది" అంటూ ప్రశ్నల్లోనే ఇరుక్కుపోకుండా, సరైన సమయంలో, సరైన విజయంతో ఆ విమర్శలకు సమాధానం చెప్పండి. అంతేగానీ మనల్ని విమర్శిస్తూ వారు ఆహ్వానించే ప్రతి యుద్ధంలో మనం పాల్గొనాల్సిన పని లేదు.

విమర్శించే వాళ్ళతో రాజీ పడమనట్లేదు, భయపడమనట్లేదు కానీ ఆ విమర్శని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలి అంటున్నాను.

M. Jaya Krishna Reddy

M.S. (Counselling & Psychotherapy)

Motivational Speaker

Cell: 9640 21 55 41

यह भी पढ़ें

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

ఆధునిక సాంకేతిక‌త‌కు పెద్ద పీట వేయాలి కేబీఆర్ చుట్టూ మ‌రింత స‌జావుగా రాక‌పోక‌లు రీసైకిల్డ్ వాట‌ర్ వినియోగంపై పూర్తి స్థాయి అధ్య‌య‌నం క్యూర్ ప‌రిధిలో ప‌నుల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

और पढ़ें →