Saturday10 October 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Editorial

चाहे कितनी भी ऊंचाइयों पर पहुंच जाएं, अपनी जड़ों को नहीं भूलना चाहिए: शशिकामोहन कांति किरण

ट्राइनेट न्यूज शशिकामोहन कांति किरण .. चाहे कितनी भी ऊंचाइयों पर पहुंच जाएं, नीचे देखना नहीं भूलना चाहिए... मानव जीवन में हर कोई हर मामले में सफलता और एक उच्च स्थान पाना चाहता है। इसके लिए निरंतर प्रयास और लक्ष्य के प्रति अटूट दृढ़ संकल्प की आवश्यकता होती है।

Staff Reporter29 September 2026, 8:05 AM13 व्यूtrinetnews.com
चाहे कितनी भी ऊंचाइयों पर पहुंच जाएं, अपनी जड़ों को नहीं भूलना चाहिए: शशिकामोहन कांति किरण

Share this story

Share link keeps your language (?lang=)

ట్రైనేట్ న్యూస్ శశిమోహన కాంతి కిరణం ..

ఎంత ఎత్తుకు ఎదిగినా క్రిందికి చూడటం.

మర్చిపోకూడదు... మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకునేది ప్రతి విషయంలోనూ విజయం, పొందాలనుకునేది ఉన్నత స్థానం.

దానికి నిరంతర శ్రమ, లక్ష్యం వదలని పట్టుదల ఈ రెండు చాలా అవసరం. కానీ ఒక్కోసారి విజయం అహంకారాన్ని తెస్తుంది. మనిషి తాను వచ్చిన దారిని, తన ఎదుగుదలకు కారణమైన వ్యక్తులను మర్చిపోతూ ఉంటాడు. అది చాలా ఘోరమైన తప్పు.

మనిషి ఎంత ఎదిగినా, తాను ఏ స్థాయి నుండి వచ్చిందీ మరచిపోకూడదు . తాను ఎక్కిన తొలి మెట్టు గుర్తు ఉంచుకోవాలి . ఎదుగుదల అంటే హోదాలో ,అంతస్థులో ,ఆస్తిలో

అన్నమాట . భగవంతుని సృష్టిలో ఎవరి స్థితి ఎలా మారేది ఎవరికీ తెలియదు. .ఓడలు బళ్ళు అవుతాయి.బళ్ళు ఓడలు అవుతాయి.

"ఎంత ఎత్తుకు ఎదిగినా క్రిందికి చూడటం మర్చిపోకూడదు" అంటూ ఉంటారు పెద్దలు. ఇది కేవలం ఒక సామెత కాదు. ఒక వ్యక్తి సంస్కారానికి ,ఉత్తమ వ్యక్తిత్వానికి నిలువుట అద్దంలాంటిది. ఇక్కడ కిందకి చూడటం అంటే ఎవరిని తక్కువ చేసి చూడటం లేకపోతే హేళన చేయటం కాదు. ఆ వ్యక్తి ఏ స్థితి నుండి తన ప్రయాణం మొదలైందో ఆ గతాన్ని గుర్తుంచుకోవాలి. సమాజంలో తనకంటే వెనకబడి ఉన్న వారిని ,నిరుపేదలను, కష్టాల్లో ఉన్నవారిని ఆదరించటం ,తాను ఎక్కడి నుండి వచ్చాడో గుర్తు ఉంచుకోవడం చాలా అవసరం.ఈరోజు రాజు రేపు సేవకుడు అన్నదాంట్లో సందేహం లేదు.

రామాయణ,మహాభారతాలు అందుకు ప్రామాణికాలు.సాక్షాత్తూ దేవదేవునికే తప్పలేదు కష్టాలు. రెండు అవతారాలలోను .శ్రీకృష్ణుని అండ ఉన్న పాండవులకే తప్పలేదు అరణ్యవాస కష్టాలు,ఏడాది పాటు పరదాస్యం లో గడిపారు.

శ్రీకృష్ణ దేవరాయలు కూడా సింహాసనం ఎక్కేవరకు సామాన్యుడుగానే బ్రతికాడు.

ఇలా ఎందరో వున్నారు.

నాకేంటి,నేనేంటి అని అహంకరించిన వారు ఏనాటికీ బాగుపడరు.నేనేంటి అని గ్రహించిన వారికి జన్మ సాఫల్యత లభిస్తుంది.ఈరోజు మనం అనుభవిస్తున్నవి ఏవైనా కానీ, అవి అన్ని పూర్వజన్మ కర్మఫలాలే. మంచిగానీ చెడు గానీ ,ఏవైనా సరే.

జీవితంలో ఎదిగిన ప్రతి మనిషి వెనుక ప్రత్యక్షంగానో ,పరోక్షంగానో ఎందరిదో శ్రమ ఉంటుంది. తాము ఎదిగాం కదా అని మనిషి తన గతాన్ని, తన మూలాల్ని, తన తల్లిదండ్రులని, తనకు విద్య నేర్పిన గురువులను, తనకు సహాయం చేసిన వ్యక్తులను మరువకూడదు. విజయం సాధించినప్పుడు వారందరినీ గౌరవించాలి. కనీసం వాటిని తలచుకొని

అవకాశాన్ని బట్టి సత్కరించుకోవాలి.

అంతేకాదు తాను నేర్చుకున్న పాఠాలతో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం, తమ వారిని బాగా చూసుకోవడం అన్నవి చాలా అవసరం. అంతేగాని అధికారం, సంపద చేతికి రాగానే తోటి మనుషులను చిన్న చూపు చూడటం మూర్ఖత్వం అనిపించుకుంటుంది .ఈ విషయంలో చరిత్ర ఎన్నో పాఠాలు నేర్పుతుంది ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే ,వినమ్రతతో మెలిగిన వారి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.

ఉదాహరణకు టాటా సామ్రాజ్య అధినేత రతన్ టాటా, తన సంపద యావత్తును సమాజ శ్రేయస్సు కోసమే ఖర్చు చేస్తూ ఎంతో నిరాడంబరంగా జీవించారు. భరతమాత ముద్దుబిడ్డ అబ్దుల్ కలాం కూడా శాస్త్రవేత్తగా, దేశ ప్రథమ పౌరుడిగా అత్యున్నత స్థానానికి ఎదిగినా చివరి శ్వాస వరకు విద్యార్థులతో సామాన్య ప్రజలతో ఎంతో వినయంగా గడిపారు.

ఎంతో అహంకారంగా, ఈ సూత్రానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన దుర్యోధనుడు, కంసుడు వంటి వారు కాల గర్భం లో. కలిసి పోయారు.

ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.

ఈజన్మ బాగుంటే అది నీవు గతజన్మలో చేసుకున్న పుణ్యం. అదే మళ్లీ మళ్లీ చేయండి.ఈజన్మలో కష్టపడితే అది గత జన్మలో చేసిన పాపం. అది అర్థం చేసుకొని వచ్చే జన్మకోసం మంచి చేయండి.ఏదైనా మీది మీకే.

నింగిని తిరిగేవాడు ఏనాటికైనా నేలకు(క్రిందకు)రాక తప్పదు.ఈ సత్యం గ్రహించండి.

* మంగళం భవతు *

శుభోదయం..శశిబాల

यह भी पढ़ें

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

ఆధునిక సాంకేతిక‌త‌కు పెద్ద పీట వేయాలి కేబీఆర్ చుట్టూ మ‌రింత స‌జావుగా రాక‌పోక‌లు రీసైకిల్డ్ వాట‌ర్ వినియోగంపై పూర్తి స్థాయి అధ్య‌య‌నం క్యూర్ ప‌రిధిలో ప‌నుల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

और पढ़ें →