శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

మెట్టుగూడ డివిజన్ లో కాంగ్రెస్ 1000 రోజుల పాలన సంబరాలు.ర్యాల రాజేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుక కార్యక్రమం జరగబడింది

Under the leadership of Ryala Rajender Yadav, Congress leaders and workers celebrated 1000 days of people-centric governance in Mettuguda.

nagendra6 September 2026, 7:34 AM21 చూసులుtrinetnews.com
మెట్టుగూడ డివిజన్ లో కాంగ్రెస్ 1000 రోజుల పాలన సంబరాలు.ర్యాల రాజేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుక కార్యక్రమం జరగబడింది

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదారాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 5 :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అదం సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ డీసీసీ జనరల్ సెక్రటరీ ర్యాల రాజేందర్ యాదవ్ ఆధ్వర్యంలో మెట్టుగూడ డివిజన్‌లో ఘనంగా సంబరాలు నిర్వహించారు.

మెట్టుగూడ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదం సంతోష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేసి, టపాసులు కాల్చి కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల ప్రజాపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు బెన్న, సీనియర్ నాయకులు జలందర్ రెడ్డి, గుంటి కృష్ణ, రఘుపతి రెడ్డి, ధీర్ సింగ్, నర్సింహ నాయక్, ప్రభాకర్, జాక్, శ్రీనివాస్, నర్సింగ్, జిత్తు, లక్ష్మీనారాయణ, లింగం, పొట్టి శ్రీను, కంటయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

అలాగే మహిళా నాయకురాళ్లు రమణి, భారతి, ఎలిజబెత్, రూత్ క్లారి, సుజాత, నిర్మల, కస్తూరి, సంతోషి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఇవి కూడా చదవండి

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →