నాచారం, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 19 : వినాయక చవితి సందర్భంగా నాచారం పరిధిలో గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. బాబానగర్‌లోని సూర్య శుభకర విజ్ఞ వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో 15 అడుగుల ఎత్తైన పర్యావరణహిత వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేసి ప్రతిష్ఠించారు. సుమారు వెయ్యి ఇస్తారాకు కప్పులతో రూపొందించిన ఈ విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా కళాకారుడు సూర్య ప్రకాష్ మాట్లాడుతూ గత 17 ఏళ్లుగా తామే స్వయంగా పర్యావరణహిత వినాయక విగ్రహాలను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో పేపర్ స్ట్రాలు, రూబిక్స్ క్యూబ్స్, చెక్క స్టిక్స్, మట్టి ప్రమిదలు, పేపర్ టీ కప్పులు, బిస్కెట్ కోన్స్, దారం, న్యూస్ పేపర్లతో వినూత్న విగ్రహాలను రూపొందించినట్లు చెప్పారు. చంద్రయాన్ స్ఫూర్తితోనూ ప్రత్యేక థీమ్‌తో విగ్రహాన్ని తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఉత్సవాల అనంతరం పర్యావరణహిత పద్ధతిలో వైభవంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Latest News
నాచారంలో ఆకట్టుకుంటున్న పర్యావరణహిత గణనాథుడు.. ఇస్తారాకు కప్పులతో 15 అడుగుల వినాయకుడు..
An eco-friendly 15-foot Ganesha idol made from about 1,000 leaf plates is captivating devotees in Nacharam for Vinayaka Chavithi.
nagendra20 September 2026, 2:19 AM2 व्यूtrinetnews.com

Share this story
Share link keeps your language (?lang=)
यह भी पढ़ें
11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి
और पढ़ें →క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయాలి

కరువు ప్రభావిత మండలాలపై ప్రాథమిక నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్స్ కు ఆదేశాలు -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
और पढ़ें →ఐఎంసీలో భారత డిజిటల్ ఆవిష్కరణల ప్రదర్శన మెయిటీ పెవిలియన్‌లో ఏఐ, సెమీకండక్టర్లు, స్టార్టప్‌లకు ప్రాధాన్యం

పార్సిల్ సేవల విస్తరణకు తపాలా శాఖ–బ్లూ డార్ట్ ఒప్పందం

