హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 10: ఈనెల 17 వతేదీన నాంపల్లి లోని పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించే తెలంగాణా ప్రజా పాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ప్రజాపాలన దినోత్సవం నిర్వహణా ఏర్పాట్లపై గురువారం డా.బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, వికాస్ రాజ్, అహ్మద్ నదీమ్, ముఖ్య కార్యదర్శులు నవీన్ మిట్టల్, క్రిస్టినా చొంగ్తూ, శిఖా గోయల్, హైదాబాద్ సి.పీ సజ్జనార్, ఆర్టీసీ ఎండి నాగి రెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద రెడ్డి తదితర సీనియర్ అధికారులు హాజయ్యారు. ఈ సందర్భంగా సి.ఎస్ మాట్లాడుతూ, ప్రజా పాలనా దినోత్సవాన్ని పబ్లిక్ గార్డెన్ లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 17 న ఉదయం అసెంబ్లీ ఎదురుగా గల అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులు అర్పించిన అనంతరం పబ్లిక్ గార్డెన్ కు వస్తారని తెలిపారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపంవద్ద, పబ్లిక్ గార్డెన్ లో సంబంధిత అధికారులు తగు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. నగరంలోని పలు ప్రధాన భవనాలకు , చారిత్రక కట్టడాలకు విద్యుత్ దీపాల అలంకరణ చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకుగానూ ఈనెల 15 న పూర్తి డ్రెస్ రిహార్సల్స్ ను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రజాపాలన దినోత్సవానికి వేయి మంది స్వయం సహాయక మహిళలతో పాటు రెండు వేల మంది హాజరవుతారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
ఈనెల 17 న పబ్లిక్ గార్డెన్ లో ఘనంగా ప్రజా పాలనా దినోత్సవం
Telangana Chief Secretary Sanjay Jaju held a review meeting for the Praja Palana Day celebrations scheduled at Public Gardens on September 17.
nagendra11 September 2026, 1:06 AM6 చూసులుtrinetnews.com

ఈ వార్తను షేర్ చేయండి
లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి
మిగతా చదవండి →క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయాలి

కరువు ప్రభావిత మండలాలపై ప్రాథమిక నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్స్ కు ఆదేశాలు -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
మిగతా చదవండి →ఐఎంసీలో భారత డిజిటల్ ఆవిష్కరణల ప్రదర్శన మెయిటీ పెవిలియన్లో ఏఐ, సెమీకండక్టర్లు, స్టార్టప్లకు ప్రాధాన్యం

పార్సిల్ సేవల విస్తరణకు తపాలా శాఖ–బ్లూ డార్ట్ ఒప్పందం

