శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

అపురూపం ఖ్యాతి పుట్ట కూచిపూడి రంగ ప్రవేశం

Khyathi Putta, disciple of noted dance guru Bompally Sudheer Rao, made her grand Kuchipudi Rangapravesam at Shilpakala Vedika.

nagendra13 September 2026, 2:48 AM7 చూసులుtrinetnews.com
అపురూపం ఖ్యాతి పుట్ట కూచిపూడి రంగ ప్రవేశం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ సెప్టెంబర్ 12:

ప్రముఖ నాట్య గురు బొంపల్లి సుధీర్ రావు శిష్యురాలు ఖ్యాతి పుట్ట కూచిపూడి రంగ ప్రవేశం సద్గురు శివానంద నృత్యమాల అకాడమీ (వరంగల్ ) ఆధ్వర్యంలో శిల్పకళా వేదిక ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మశ్రీ సినీ నటుడు మురళీమోహన్, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ అలేఖ్య పుంజాల పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రవి పుట్ట రాణి దంపతులు ఖ్యాతి పట్టుదలతో కూచిపూడి నృత్యంలో రాణించడం అభినందనీయమన్నారు. కూచిపూడి రంగంలో ప్రసిద్ధి చెందినగురు బొంపల్లి సుధీర్ రావు వద్ద 2024 సంవత్సరంలో శిక్షణ ప్రారంభించి కళ రంగంలో దొరికిన ప్రతి అవకాశంలో అంకితభావంతో తన శిక్షణను కొనసాగించిందన్నారు. రంగ ప్రవేశం కేవలం నేర్చుకున్న అంశాల ప్రదర్శన మాత్రమే కాదని కొనసాగుతున్న ప్రయాణంలో ఒక మైలురాయి మాత్రమేనన్నారు.

ఖ్యాతి గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతూ .. కళా రంగంలో రాణించడం సంతోషంగా ఉందన్నారు. చదువుతోపాటు నృత్యం, కర్ణాటక సంగీతం, టెన్నిస్ రంగాలలో రాణిస్తుందని తెలిపారు. గురు బొంపల్లి సుధీర్ రావు వరంగల్ లో 40 సంవత్సరాల క్రితం పది మంది విద్యార్థులతో అకాడమిని స్థాపించి దాదాపు 600 మంది విద్యార్థులు కూచిపూడి రంగంలో రాణించారని పేర్కొన్నారు. అనేకమంది విద్యార్థులు సిసిఆర్టి స్కాలర్ షిప్

8 మంది విద్యార్థులు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుండి స్కాలర్ షిప్ పొందుతున్నారని తెలిపారు. సభకు ముందు ఖ్యాతి ప్రదర్శించిన గజవదన, ఎందరో మహానుభావులు, భామ కలాపం, శంకర శ్రీగిరి, జయ జయ దుర్గే తదితర అంశాలు ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →