Saturday10 October 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

ఏఎన్నార్ జయంతి సందర్భంగా సినీ సంగీత విభావరి అలనాటి మధుర గీతాలతో అలరించిన గాయనీ గాయకులు

A special musical concert was held in Hyderabad to mark the birth anniversary of legendary actor Akkineni Nageswara Rao, featuring timeless melodies.

nagendra24 September 2026, 5:02 AM2 व्यूtrinetnews.com
ఏఎన్నార్ జయంతి సందర్భంగా సినీ సంగీత విభావరి అలనాటి మధుర గీతాలతో అలరించిన గాయనీ గాయకులు

Share this story

Share link keeps your language (?lang=)

  • హైదరాబాద్, సెప్టెంబర్ 23 (ట్రైనెట్ న్యూస్):

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతిని పురస్కరించుకుని వీకే మ్యూజిక్ మీడియా ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక ‘సినీ సంగీత విభావరి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

చిక్కడపల్లిలోని కళా దీక్షితులు కళావేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు విజయకుమార్ పాసం తన మధుర గానంతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు. ఏఎన్నార్ నటించిన పలు విజయవంతమైన చిత్రాల్లోని సూపర్‌హిట్ పాటలను గాయనీ గాయకులు ఆలపించి సంగీతాభిమానులను ఆనాటి మధుర జ్ఞాపకాలలోకి తీసుకెళ్లారు.

ఈ సంగీత విభావరిలో దేవ సహాయము, శ్రీనివాస్, డాక్టర్ స్వర్ణ ఎం., సరోజినీ దేవి, లక్ష్మీ ప్రియ తదితర గాయనీ గాయకులు పాల్గొని తమ గాన ప్రతిభను ప్రదర్శించారు. వారు ఆలపించిన మధురమైన సినీ గీతాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అక్కినేని నాగేశ్వరరావు అందించిన అమూల్యమైన సేవలను ఈ సందర్భంగా వక్తలు స్మరించుకున్నారు. తన సహజ నటన, విలక్షణమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు ఏఎన్నార్ అని కొనియాడారు.

అలనాటి సినీ సంగీత వైభవాన్ని నేటి తరానికి పరిచయం చేస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యంతం సంగీతాభిమానులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో కళాకారులు, సంగీత ప్రియులు, ఏఎన్నార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →