Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

Must Pass Down Cultural Glory to Future Generations: Minister Jupally

Telangana Minister Jupally Krishna Rao emphasized the collective responsibility of preserving and passing down cultural heritage to future generations during the Nataraja Ramakrishna National Dance Festival.

nagendra19 August 2026, 3:28 PM6 व्यूtrinetnews.com
Must Pass Down Cultural Glory to Future Generations: Minister Jupally

Share this story

Share link keeps your language (?lang=)

*భాషా సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు

రవీంద్ర భారతి, 19 : సాంస్కృతిక వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ భాషా సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఎస్ఎంఎస్ గ్రూప్ చైర్మన్ జూపల్లి మంజుల రావు సహకారంతో

లోక ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ నట రాజరామకృష్ణ జాతీయ నృత్యోత్సవం బుధవారం సాయంత్రం రవీంద్ర భారతిలో ప్రధాన మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ జాతీయ నృత్యోత్సవానికి డా. కళాకృష్ణ నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, ఫార్మాసిటికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రాజు భాను, తెలంగాణ ఇన్కమ్ టాక్స్ అడిషనల్ కమిషనర్ శంకర్ పండీ, వంశీ రాం బిల్డర్స్ సీఎండీ బద్వేలు సుబ్బారెడ్డి, నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ అండ్ కరస్పాండ్ జక్కుల త్రిశూల్ రెడ్డి తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి గురు

సుజాత మహోపాత్ర కు

నటరాజ రామకృష్ణ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు 2026 ప్రదానం

చేశారు. అలాగే సాంప్రదాయం కల్చరల్ ట్రస్ట్ డైరెక్టర్

స్వాతి సోమనాథ్ (ఆంధ్రప్రదేశ్)

డాక్టర్ పేరిణి కుమార్ (తెలంగాణ),

కథక్ సంజయ్ జోషి (తెలంగాణ) కూచిపూడి జ్వాలాముఖి పిన్న (తెలంగాణ); ఆంధ్ర నాట్యం గీత హజారే, ( మలేషియా), ఆంధ్ర నాట్యం సంజయ్ వడపల్లి ( హాంకాంగ్ ), ఆంధ్ర నాట్యం హరిత కనగల (తెలంగాణ),

ఒడిస్సి దేబాశ్రీ పట్నాయక్ (తెలంగాణ), పేరిని సతీష్ (తెలంగాణ) లకు పద్మశ్రీ నటరాజ రామకృష్ణ జాతీయ అవార్డ్స్ -2026 లకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. భారత శాస్త్రీయ సంగీత నృత్య కళలే ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. భారతీయ మూలాలు మర్చిపోకుండా సాంస్కృతిక

వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షిస్తున్న లోక ఆర్ట్స్ ను వారు అభినందించారు.

అంతకముందు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ కళా కృష్ణ ఆంధ్ర నాట్య ప్రదర్శన, కేరళ చెందిన చిత్ర సుకుమారన్ మోహిని ఘట్టం, సిరాజుద్దీన్ పేరిణి నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జూపల్లి మంజుల, ఫెస్టివల్ చైర్మన్ బీఆర్ విక్రమ్ కుమార్, లోక ఆర్ట్స్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, సి డి ఎఫ్ ఓ నేషనల్ సెక్రెటరీ సాయి వెంకటేష్, మెంబర్ ఒడిస్సా జగపతి జన, డాక్టర్ సజిని వల్లభనేని పలువురు నాట్యగురువులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →