Saturday10 October 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

శాస్త్రీయ కళలతో వ్యక్తిత్వ వికాసం

Eminent artists and dignitaries emphasize the importance of classical arts in shaping youth personality and preserving Indian heritage at Ravindra Bharathi.

nagendra13 September 2026, 2:46 AM3 व्यूtrinetnews.com
శాస్త్రీయ కళలతో వ్యక్తిత్వ వికాసం

Share this story

Share link keeps your language (?lang=)

  • హైదరాబాద్, రవీంద్రభారతి ట్రైనెట్ న్యూస్ సెప్టెంబరు 12:

శాస్త్రీయ కళలు వ్యక్తిత్వ వికాసానికి, భారతీయ వారసత్వ పరిరక్షణకు, విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడతాయని

యక్షగాన కంఠీరవ పసుమర్తి శేషుబాబు, ప్రముఖ సంగీత విద్వాంసురాలు, ప్రొఫెసర్ డా. కె. శేషులత విశ్వనాథ్ అన్నారు. ప్రముఖ నృత్య సంస్థ నృత్యదీక్షాలయ 9వ వార్షికోత్సవం సందర్భంగా ‘నృత్యార్పణం ’ పేరిట శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు రవీంద్రభారతిలో నిర్వహించారు . కార్యక్రమానికి ముఖ్య అతిథిగా

పసుమర్తి శేషుబాబు పాల్గొని కె. శేషులత విశ్వనాథ్ ఐపీఎస్ , డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె. శిల్పవల్లి, అసిస్టెంట్ ప్రొఫెసర్

డా. వై. లలిత సింధూరి, యక్షగాన

కళాకారుడు డా. పసుమర్తి శేషుబాబు తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

యువతలో క్రమశిక్షణ, విలువలు, సృజనాత్మకత పెంపొందించడంలో శాస్త్రీయ నృత్యాలకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు.

1999లో లక్ష్మీ శంకర్ కళా దర్శకత్వంలో ప్రారంభమైన నృత్యదీక్షాలయ సంస్థ దాదాపు మూడు దశాబ్దాలుగా శాస్త్రీయ నృత్య కళా రంగానికి విశేష సేవలందిస్తోందని కొనియాడారు.

సభ సమన్వయకర్త వెంకట్ దీక్షితులు ప్రారంభోపన్యాసం చేశారు. సభకు ముందు కళాకారులు ప్రదర్శించిన చారిత్రక, పౌరాణిక, ఆధ్యాత్మిక అంశాలను ప్రతిబింబించే అగస్త్య మహర్షి, ఛత్రపతి శివాజీ, శ్రీరామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వంటి మహనీయుల జీవితాలు, భావజాలాన్ని నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి.

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →