Saturday10 October 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

రా అండ్ రస్టిక్, బోల్డ్‌గా ‘డానీ’ ఫస్ట్ స్ట్రైక్

The makers of 'Danny' have released its first strike, promising a raw, rustic, and bold romantic crime drama.

nagendra19 September 2026, 2:40 AM1 व्यूtrinetnews.com
రా అండ్ రస్టిక్, బోల్డ్‌గా ‘డానీ’ ఫస్ట్ స్ట్రైక్

Share this story

Share link keeps your language (?lang=)

రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్‌ల మీద రిజ్వాన్ నిర్మాణంలో కళ్యాణ్‌జీ గోగణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘డానీ’. ఈ సినిమాలో ఆశిష్ గాంధీ, సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. రొమాంటిక్ క్రైమ్ డ్రామాగా రానున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ స్ట్రైక్ ను తాజాగా విడుదల చేశారు.

‘నువ్వు బీచ్‌కి ఎప్పుడూ ఒంటరిగా వస్తావా?’.. అని అమ్మాయి అడగడం.. ‘నేను బీచ్‌కి రావాలంటే కచ్చితంగా అమ్మాయి ఉండాల్సిందే’ అని హీరో చెప్పే డైలాగ్.. ఆ తర్వాత వచ్చే బోల్డ్ డైలాగ్, బీచ్‌లో అమ్మాయి అందాలు ఇలా అన్నీ కూడా యూత్ ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ఈ టీజర్‌ని గమనిస్తే కావాల్సినంత యాక్షన్‌తో పాటు రొమాన్స్ కూడా ఉందని అర్థం అవుతోంది. బోల్డ్, రా అండ్ రస్టిక్‌గా ‘డానీ’ రానుందని ఈ ఫస్ట్ స్ట్రైక్ చెప్పకనే చెబుతోంది.

కళ్యాణ్‌జీ గోగన–ఆశిష్ గాంధీ కాంబినేషన్‌లో వచ్చిన ‘నాటకం’, ‘కళింగ’ చిత్రాలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకున్నాయి. ఇప్పుడు ఈ సక్సెస్‌ఫుల్ కాంబో మరోసారి ‘డానీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో సినిమాపై ఆసక్తి, క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది.

డానీ ఫస్ట్ స్ట్రైక్ లోని విజువల్స్, కెమెరా వర్క్ టాప్ నాచ్‌లో ఉంది. సాయి కార్తీక్ బీజీఎం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ మూవీకి ఖుషి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏకే ఆనంద్ కెమెరామెన్‌గా, మణికాంత్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర అప్డేట్లను మేకర్స్ ప్రకటించనున్నారు. ఇక అక్టోబర్ లో ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

తారాగణం : ఆశిష్ గాంధీ, సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ తదితరులు

సాంకేతిక సిబ్బంది:

దర్శకుడు: కళ్యాణ్‌జీ గోగణ

నిర్మాతలు: రిజ్వాన్

సమర్పణ: కొల్లి గోపాల కృష్ణ

సంగీత దర్శకుడు: సాయికార్తీక్

సహ నిర్మాత: ఖుషి

సినిమాటోగ్రాఫర్: ఏకే ఆనంద్

ఎడిటర్: మణికాంత్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భార్గవ్ తోట

యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్ సుంకర, కళ్యాణ్‌జీ గోగణ

కో-డైరెక్టర్: సాయిరామ్ జల్లా

సౌండ్ డిజైన్: రిథమ్ స్టూడియోస్

పబ్లిసిటీ డిజైన్: కోటి వర్క్స్

PRO: సాయి సతీష్

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →