నాచారం, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 17 : గణేష్ సురక్ష సంకల్ప్- 2026 లో భాగంగా ‘మెరుగైన భవిష్యత్తు కోసం సంకల్పం అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. మల్లాపూర్ ఎన్ ఎఫ్ సి యువసేన ఆధ్వర్యంలో ఎన్ ఎఫ్ సి కాలనీలోని గణేష్ మండపాల వద్ద రోడ్ సేఫ్టీపై ప్రజలు, యువతకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి రోడ్ సేఫ్టీ డీసీపీ లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రాఫిక్ ఏసీపీ సంపత్ కుమార్, ట్రాఫిక్ సీఐ శ్రీ నాగరాజు, రోడ్ సేఫ్టీ సీఐ ప్రదీప్ కుమార్, డీఐ వరుణ్ కాంత్ రెడ్డి, ఎస్ఐ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ నిర్వాహకులు, యువత, స్థానిక ప్రజలతో అధికారులు మాట్లాడారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం, తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, వేగాన్ని నియంత్రించడం, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. గణేష్ ఉత్సవాల సమయంలో ప్రజలు, యువత బాధ్యతాయుతంగా వ్యవహరించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని పోలీసు అధికారులు సూచించారు.
Latest News
గణేష్ మండపాల వద్ద రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం..
Traffic police organized a road safety awareness program at Ganesha pandals in Nacharam as part of the Ganesh Suraksha Sankalp-2026 initiative.
nagendra17 September 2026, 11:41 PM2 व्यूtrinetnews.com

Share this story
Share link keeps your language (?lang=)
यह भी पढ़ें
11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి
और पढ़ें →క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయాలి

కరువు ప్రభావిత మండలాలపై ప్రాథమిక నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్స్ కు ఆదేశాలు -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
और पढ़ें →ఐఎంసీలో భారత డిజిటల్ ఆవిష్కరణల ప్రదర్శన మెయిటీ పెవిలియన్లో ఏఐ, సెమీకండక్టర్లు, స్టార్టప్లకు ప్రాధాన్యం

పార్సిల్ సేవల విస్తరణకు తపాలా శాఖ–బ్లూ డార్ట్ ఒప్పందం

