శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

రుద్ర-శివ సాంస్కృతిక సంస్థ 13వ వార్షికోత్సవ వేడుకలు నెల్లుట్ల రవీందర్‌రావుకు ‘రుద్ర-శివ జాతీయ ప్రతిభా పురస్కారం’

The 13th-anniversary celebrations of the Rudra-Shiva Cultural Organization will be held grandly in Hyderabad, featuring prestigious awards, a musical night, and a drama performance.

nagendra8 September 2026, 2:17 AM4 చూసులుtrinetnews.com
రుద్ర-శివ సాంస్కృతిక సంస్థ 13వ వార్షికోత్సవ వేడుకలు నెల్లుట్ల రవీందర్‌రావుకు ‘రుద్ర-శివ జాతీయ ప్రతిభా పురస్కారం’

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

సంగీత విభావరి, శ్రీకృష్ణ రాయబారం నాటక ప్రదర్శన

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 7:

రుద్ర-శివ సాంస్కృతిక సంస్థ 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవాన్ని సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖులు, కళాకారులు, వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రతిభావంతులను సత్కరించనున్నారు.

కార్యక్రమంలో భాగంగా నెల్లుట్ల రవీందర్‌రావుకు ‘రుద్ర-శివ జాతీయ ప్రతిభా పురస్కారం’ ప్రదానం చేయనున్నారు. పలువురు ప్రముఖులు, సాహితీ, సాంస్కృతిక రంగాలకు చెందిన విశిష్ట అతిథులు సభా కార్యక్రమంలో పాల్గొననున్నారు.

మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు సంగీత విభావరి నిర్వహించనుండగా, అనంతరం ‘శ్రీకృష్ణ రాయబారం’ పూర్తి నాటకాన్ని ప్రదర్శించనున్నారు. రాత్రి 8 గంటలకు ముఖ్య అతిథుల సమక్షంలో సభా కార్యక్రమం, ప్రతిభా పురస్కారాల ప్రదానం జరగనుంది.

చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ మెయిన్ హాల్‌లో సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. కళాభిమానులు, సాహితీవేత్తలు, సంగీత ప్రియులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రుద్ర-శివ సాంస్కృతిక సంస్థ నిర్వాహకులు కోరారు.

ఇవి కూడా చదవండి

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →