Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

Sammohana Krishna's Kuchipudi Rangapravesam captivates audience

Sammohana Krishna dazzled audiences with her Kuchipudi debut titled 'Sammohana Krishna Shad Tarangini' at Bharatiya Vidya Bhavan in Hyderabad.

nagendra30 August 2026, 2:07 AM5 व्यूtrinetnews.com
Sammohana Krishna's Kuchipudi Rangapravesam captivates audience

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 29 :

కళా తపస్విని డా. కిరణ్మయి బొనాల శిష్యురాలైన సమ్మోహన కృష్ణ కూచిపూడి రంగప్రవేశం 'సమ్మోహన కృష్ణ షాద్ తరంగిణి' పేరిట శనివారం రాత్రి సమ్మోహన ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో భారతీయ విద్యా భవన్ లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ప్రముఖ సినీ టీవీ నటులు సి.వి.ఎల్. నరసింహ రావు యక్షగాన కంఠీరవగురు డా. పసుమర్తి శేషు బాబు, గ్లోబ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ డైరెక్టర్ లయన్ డా. సత్యనారాయణ సంఘిశెట్టి పాల్గొన్నారు. నర్తకి సమ్మోహన కృష్ణ పదవర్ణం, గణేష్ పంచతంత్ర, ఉషా ప్రవేశ దరువు, కృష్ణ నీ బేగానే బరో, శ్లోకాభినయనంతో జల్లికట్టు తదితర అంశాలపై ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. నర్తకి సమ్మోహన కృష్ణ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలు ప్రదర్శించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ అధ్యక్షురాలు పద్మా కళ్యాణ్ పాల్గొన్నారు.

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →