ఆదివారం11 అక్టోబర్ 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

తక్షణమే కరువు మండలాలు ప్రకటించాలి: టీఆర్ఎస్ చీఫ్ కవిత డిమాండ్

Super Admin4 October 2026, 4:32 PM7 చూసులుtrinetnews.com
తక్షణమే కరువు మండలాలు ప్రకటించాలి: టీఆర్ఎస్ చీఫ్ కవిత డిమాండ్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 04 : రాష్ట్రం కరువుతో అల్లాడుతోందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తక్షణమే కరువు మండలాలను ప్రకటించాలంటూ ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు 20 అడుగులు పడిపోయాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుణ యాగం చేసినా.. వర్షాలు పడక పోవడంతో ఆయన చేతులెత్తేశారని వ్యంగ్యంగా అన్నారు. ఆదివారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో 6 గంటలకు మించి విద్యుత్ ఇవ్వడం లేదని రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు.విద్యుత్ కోతలు నిరూపించేందుకు సీఎం రేవంత్ స్వగ్రామం కొండారెడ్డిపల్లికి రమ్మన్నా వస్తానంటూ ఆయనకు కవిత సవాల్ విసిరారు. ప్రభుత్వం ఏం చేసైనా రైతులకు కరెంట్ ఇచ్చి తీరాల్సిందేనని సీఎం రేవంత్‌కి స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో నిండుగా నీళ్లున్నా రాష్ట్రంలోని ప్రాజెక్టులను వాటితో నింపలేదని ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని టీఆర్ఎస్ చీఫ్ కవిత ప్రశ్నించారు

ఇవి కూడా చదవండి

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →