Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

ప్రజాస్వామ్యాన్ని సీఈసీ జ్ఞానేష్ ఖూనీటీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

nagendra8 October 2026, 11:58 AM2 व्यूtrinetnews.com
ప్రజాస్వామ్యాన్ని సీఈసీ జ్ఞానేష్ ఖూనీటీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 08:

మోదీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో దేశ ప్రజలు గమనిస్తున్నారని.. ఇప్పటికైనా దేశ ప్రజలు మేల్కొవాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. లోక్‌భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉండడానికి మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని సీఈసీ జ్ఞానేష్ ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో యథేచ్ఛగా ఓట్ చోరీ జరుగుతోందని ఆరోపణలు గుప్పించారు. తాము ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్నామన్నారు.

బిహార్, వెస్ట్ బెంగాల్ తర్వాత తెలంగాణను బీజేపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని మహేశ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ కుమ్మక్కై 92 లక్షల ఓట్లు తొలగించిందని ఆరోపించారు. మోదీ, అమిత్‌షా వల్ల 12 సంవత్సరాల్లో దేశ ప్రజలకు ఎంత మేలు కలిగిందో ఆలోచించాలన్నారు. సీఈసీ జ్ఞానేష్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జ్ఞానేష్‌కుమార్‌ను తొలగించే వరకు తమ ఉద్యమం ఆగదని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు.

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →