శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

దుబాయ్‌లో 11న ఘనంగా బతుకమ్మ వేడుకలు ఈటీసీఏ ఆధ్వర్యంలో ఏర్పాట్లు.. హాజరుకానున్న బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం

nagendra8 October 2026, 1:20 PM6 చూసులుtrinetnews.com
దుబాయ్‌లో 11న ఘనంగా బతుకమ్మ వేడుకలు ఈటీసీఏ ఆధ్వర్యంలో ఏర్పాట్లు.. హాజరుకానున్న బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

దుబాయ్‌, అక్టోబరు 8 (ట్రైనెట్ న్యూస్):

ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక, సంక్షేమ సంఘం (ఈటీసీఏ) ఆధ్వర్యంలో 16వ బతుకమ్మ వేడుకలను ఈ నెల 11న దుబాయ్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంఘం వ్యవస్థాపకులు కిరణ్ కుమార్ పీచరా మార్గదర్శకత్వంలో అల్ ముల్లా ప్లాజా వెనుకనున్న అల్ అహ్లీ క్రీడా ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వేడుకలు జరగనున్నాయి. కార్యక్రమానికి ప్రవేశం ఉచితమని నిర్వాహకులు తెలిపారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నేతృత్వంలో బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం ఈ వేడుకలకు హాజరుకానుందని పేర్కొన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, సురేందర్‌, షకీల్ అహ్మద్ పాల్గొననున్నట్లు వెల్లడించారు. వేడుకల్లో గాయని, కవయిత్రి, నృత్య రూపకర్త డాక్టర్ కోకిల నాగరాజు, ప్రముఖ గాయని మధుప్రియ, గాయని, నర్తకి అంజలి పులింటి ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సంప్రదాయ బతుకమ్మ ఆటపాటలతోపాటు తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద గీతాలు, నృత్యాలు, ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. విందు భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, బతుకమ్మ పండుగ విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఏటా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని ఈటీసీఏ నిర్వాహకులు పేర్కొన్నారు. దుబాయ్‌లోని తెలంగాణ కుటుంబాలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.

ఇవి కూడా చదవండి

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →