శనివారం10 అక్టోబర్ 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

'ఇన్విక్టస్ ఇంజనీరింగ్ 2.Oను ప్రారంభించిన ఆకాష్'

nagendra9 October 2026, 2:22 AM0 చూసులుtrinetnews.com
'ఇన్విక్టస్ ఇంజనీరింగ్ 2.Oను ప్రారంభించిన ఆకాష్'

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 8:

ఇన్విక్టస్ ఆధారిత అత్యుత్తమ విద్యా విధానంతో జేఈఈ శిక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తూ తమ సంస్థ ఇంజనీరింగ్ 2.Oను ప్రారంభించినట్లు ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) స్టేట్ హెడ్ అమిత్ కుమార్, ఏపీ, తెలంగాణ అడ్మిషన్ హెడ్ అరబింద్ కుమార్ తెలిపారు.ఈ మేరకు గురువారం హిమాయత్ నగర్ లోని ఆకాష్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇన్విక్టస్-ఇంజనీరింగ్ 2.Oకు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని ప్రముఖ ప్రవేశ పరీక్షల శిక్షణ సంస్థ ఆకాష్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం "ఇన్విక్టస్ 2.O" అనే నూతన సమగ్ర బోధనా విధానాన్ని ప్రారంభించిందన్నారు.జాతీయ, రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులు అందించడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు.శాస్త్రీయ అధ్యయన సామగ్రి, నమూనా పరీక్షల విశ్లేషణ, నిరంతర మార్గదర్శకత్వం, విద్యార్థుల సామర్థ్యానికి తగినట్లుగా నాలుగు ప్రత్యేక బ్యాచ్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా ఉన్న తమ అన్ని శాఖల్లో ఈ విధానం అందుబాటులో ఉంటుందని తెలిపారు.ప్రతి తరగతి, సాధన ప్రక్రియను జేఈఈ అడ్వాన్సుడ్, జేఈఈ మెయిన్, బిట్స్ఏటీ, రాష్ట్ర ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో సాధ్యమైనంత ఉత్తమ ర్యాంకు సాధించడమే లక్ష్యంగా రూపొందించినట్లు పేర్కొన్నారు.ఇన్విక్టస్ కు అధ్యాపక బృందమే ప్రధాన బలమని, ఈ విద్యా బృందమే ఇన్విక్టస్ పాఠ్య ప్రణాళిక, పుస్తకాలు, పరీక్ష విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు.ఈ విద్యా బృందం అభ్యసన శాస్త్రం, పరీక్ష సరళిపై లోతైన పరిశోధనలతో పుస్తకాలను తిరిగి రాసిందని, ఇది విద్యార్థులను ప్రాథమిక అంశాలను నుంచి అత్యంత కఠినమైన సమస్యల వరకు దశల వారీగా తీసుకువెళుతుందన్నారు.దీనిపై మరిన్ని వివరాలు, సమాచారం కోసం ఫోన్ నెంబర్: 7303759494ను సంప్రదించవచ్చునని వారు కోరారు.ఈ సమావేశంలో ఏఈఎస్ఎల్ ఇంజనీరింగ్ హెడ్ ఎం.కె.వెంకటేష్, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →