Saturday10 October 2026Vijayawada

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
Languages

Latest News

వ్యాపారులకు భారీ ఊరట

nagendra9 October 2026, 2:28 AM1 viewstrinetnews.com
వ్యాపారులకు భారీ ఊరట

Share this story

Share link keeps your language (?lang=)

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 8 :

దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసే దిశగా జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో.. పన్ను చెల్లింపుదారులకు పెద్దపీట వేస్తూ పలు సంస్కరణలకు ఆమోదం తెలిపారు. ముఖ్యంగా వ్యాపార వర్గాల నుంచి ఎప్పట్నుంచో డిమాండ్ ఉన్న జీఎస్టీ అధికారుల అరెస్ట్ అధికారాలను కౌన్సిల్ రద్దు చేసింది. ఈ విధానం ప్రకారం.. నిర్దిష్ట సమాచార ఆధారంగా మాత్రమే సరకులను అడ్డుకుని తనిఖీ చేయాల్సి ఉంటుంది. దీంతో జీఎస్టీ అధికారులు యథేచ్ఛగా వాహనాలను ఆపి చెక్ చేసే అవకాశం ఉండదు. సరకుల స్వాధీనం కూడా సరఫరా జరిగే రాష్ట్రం లేదా సరకు చేరే రాష్ట్రానికి చెందిన అధికారులు మాత్రమే చేపట్టేలా నిబంధనలను మార్చాలని మండలి సిఫార్సు చేసింది.దీంతోపాటు నేర విచారణకు సంబంధించిన కనీస పరిమితిని కూడా రూ.1 కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచుతున్నట్టు కౌన్సిల్ నిర్ణయించింది. ఇకపై జరిమానా, జైలు శిక్ష లేదా రెండింట్లో ఏది విధించాలన్నది కేసును బట్టి న్యాయస్థానాలే నిర్ణయిస్తాయని స్పష్టం చేసింది. నిర్దిష్ట జరిమానా లేని ఉల్లంఘనలకు విధించే సాధారణ జరిమానానూ రూ.25 వేల నుంచి రూ.10 వేలకు తగ్గించింది. పన్ను చెల్లింపుల్లో ఆలస్యం చేయడం, చిన్న చిన్న పొరపాట్లు చేయడం, రిటర్నులు ఆలస్యంగా దాఖలు చేయడం వంటి సందర్భాల్లో.. పన్ను వసూలు, వడ్డీ, నిబంధనలకు అనుగుణంగా జరిమానా మాత్రమే ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అంతకుమించి చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. కొంతకాలంగా కఠినమైన పన్ను విధానాలతో వ్యాపార రంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో.. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయాలు భారీ ఊరటను కలిగించనున్నాయి. 'ఈజ్ ఆఫ్ డూయింగ్(సులభతర వాణిజ్యం)'ను ప్రోత్సహించడం సహా పన్ను నిబంధనల అమలులో భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ సంస్కరణలు తీసుకొచ్చినట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. జీఎస్టీ రేట్లలో మార్పులు తీసుకురావడం కంటే దానిని సరళీకరించడంపైనే ఈ భేటీలో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టు పేర్కొన్నారామె.

Also read

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

Read more →