Saturday10 October 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్, కేక్ కటింగ్స్ వద్దు!

nagendra9 October 2026, 7:54 AM3 व्यूtrinetnews.com
ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్, కేక్ కటింగ్స్ వద్దు!

Share this story

Share link keeps your language (?lang=)

అర్ధరాత్రి రోడ్లపైకొచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు

హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ విజ్ఞప్తి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 9: ట్యాంక్‌బండ్‌తో పాటు ప్రధాన రహదారులు, చెరువులు, పార్కుల వద్ద అర్ధరాత్రి వేళల్లో పుట్టినరోజు వేడుకలు, కేక్ కటింగ్‌లు చేయవద్దని నగర ప్రజలకు, ముఖ్యంగా యువత, తల్లిదండ్రులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు. సంతోషంగా జరుపుకోవాల్సిన పుట్టినరోజు వేడుకలు క్షణికావేశం, నిర్లక్ష్యం వల్ల కుటుంబాలకు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవల అర్ధరాత్రి 2 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ సమయంలో ఆరేళ్ల పాప పుట్టినరోజు వేడుక జరిపేందుకు కుటుంబ సభ్యులంతా కలిసి ట్యాంక్‌బండ్‌కు రాగా, తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగి పుట్టినరోజు నాడే ఆ చిన్నారితో పాటు కుటుంబ సభ్యుడు దుర్మరణం చెందిన ఘటనను ప్రస్తావించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ ముందస్తు చర్యలు చేపట్టేందుకు పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి ట్యాంక్‌బండ్‌పై ప్రమాద స్థలాన్ని పరిశీలించినట్లు వెల్లడించారు. అక్కడ జరుగుతున్న ప్రమాదాల నివారణపై వివిధ ప్రభుత్వ విభాగాలతో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించామని వివరించారు. పుట్టినరోజు అనేది కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వేడుకని, దానిని ఇళ్ల వద్ద లేదా ఏదైనా సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే జరుపుకోవాలని స్పష్టం చేశారు. అర్ధరాత్రి వేళల్లో రోడ్లపై జనసంచారం తక్కువగా ఉండటంతో వాహనాలు మితిమీరిన వేగంతో దూసుకొస్తుంటాయని, అలాంటి సమయంలో చిన్నపిల్లలను వెంటేసుకుని నడిరోడ్డుపైకి రావడం ఏమాత్రం వివేకం కాదన్నారు.

అసలు ట్యాంక్‌బండ్‌పై ఇలాంటి వేడుకలు నిర్వహించడం నిబంధనల ప్రకారం పూర్తిగా నిషేధమని, గతంలోనే జీహెచ్‌ఎంసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు. పోలీసులు నిరంతరం అక్కడికి వచ్చేవారిని వెనక్కి పంపిస్తున్నప్పటికీ, అర్ధరాత్రి పూట మళ్లీ వచ్చి వేడుకలు చేసుకోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కేవలం క్షణికానందం కోసం చేసే పొరపాట్ల వల్ల అమూల్యమైన ప్రాణాలను పోగొట్టుకోవద్దని హెచ్చరించారు. ఇకపై ఎవరూ కూడా అర్ధరాత్రి వేళల్లో ట్యాంక్‌బండ్, చెరువులు, బహిరంగ ప్రదేశాల వద్దకు వచ్చి సంబరాలు చేసుకోవద్దని, సిటీ పోలీసులకు సహకరిస్తూ ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు.

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →