Saturday10 October 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

12 న ఎల్‌నినో ప్రభావం పై మంత్రి వర్గ సమావేశం

nagendra10 October 2026, 2:24 AM0 व्यूtrinetnews.com
12 న ఎల్‌నినో ప్రభావం పై మంత్రి వర్గ సమావేశం

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 9:

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఈ నెల 12వ తేదీన మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. వర్షపాతం తగ్గిన ప్రాంతాల్లో పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వం చేపట్టాల్సిన తక్షణ చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వ్యవసాయం, సాగునీరు, తాగునీటి సరఫరా, పెరిగిన విద్యుత్ డిమాండ్, తక్షణ అవసరాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్షాభావ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగా, దాదాపు 235 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.

కరువు మండలాల ప్రకటనతో పాటు తగినంత ఆర్థిక సాయం అందించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రూ. 20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని కోరింది.

వర్షాభావ ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలు, ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం రూపొందించిన కార్యాచరణ, అఖిలపక్ష సమావేశం, రైతు సంఘాలు, వివిధ రంగాల నిపుణుల సలహాలు, సూచనలపై ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశంలో చర్చించే అవకాశముందని తెలుస్తోంది.

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →