హైదారాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 9:
విశ్వశాంతి యువజన సంఘం, శ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని నోముల ప్రకాశ్‌రావు, ఏడుకొండలును కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారికి ఆహ్వాన పత్రికలు అందజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు జి.ఎం. మల్లేష్, గోవింద్, యాదగిరి, రాజమౌళి, లక్ష్మణ్ పాల్గొన్నారు.





