న్యూ ఢిల్లీ, అక్టోబరు 9 (ట్రైనెట్ న్యూస్):
దేశవ్యాప్తంగా పార్సిల్ సేవలను బలోపేతం చేసేందుకు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ, బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇండియా పోస్ట్ పార్సిల్ సేవలకు సంబంధించిన ఈ ఒప్పందంపై శుక్రవారం న్యూ ఢిల్లీలో ఇరు సంస్థల ఉన్నతాధికారుల సమక్షంలో సంతకాలు జరిగాయి.
తపాలా శాఖకు ఉన్న విస్తృత సేవా వ్యవస్థ, విశ్వసనీయ డెలివరీ నెట్‌వర్క్‌కు బ్లూ డార్ట్ లాజిస్టిక్స్ సామర్థ్యాలను అనుసంధానించడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. తద్వారా దేశవ్యాప్తంగా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సమర్థవంతమైన, నమ్మకమైన పార్సిల్ డెలివరీ సేవలను అందించేందుకు ఇరు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి.





