శనివారం10 అక్టోబర్ 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

పల్లవి కిడ్జ్ తార్నాక బ్రాంచ్‌ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

nagendra10 October 2026, 2:53 AM46 చూసులుtrinetnews.com
పల్లవి కిడ్జ్ తార్నాక బ్రాంచ్‌ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

తార్నాక, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 9 :

తార్నాకలోని పల్లవి కిడ్జ్ బ్రాంచ్‌ లో బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ హెడ్ పరోమిత, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని వేడుకలను సందడిగా జరుపుకున్నారు. బతుకమ్మ పండుగ విశిష్టతను చిన్నారులకు తెలియజేస్తూ తెలంగాణ సంప్రదాయాలు, సాంస్కృతిక విలువలపై అవగాహన కల్పించారు. పండుగ వాతావరణంలో నిర్వహించిన ఈ వేడుకలు విద్యార్థుల్లో ఆనందాన్ని నింపాయి. పాఠశాల స్థాయిలో ఇలాంటి కార్యక్రమాల నిర్వహణతో చిన్నారులకు మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆసక్తి పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

ఇవి కూడా చదవండి