Wednesday14 October 2026హైదరాబాద్

SENSEX72,782+1.66%
NIFTY22,623+1.76%
HYD 22K₹1,34,507/10g-2.34%
भाषाएँ

Latest News

సృజనాత్మక ఆలోచనలకు ప్రోత్సాహం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

nagendra11 October 2026, 1:39 AM0 व्यूtrinetnews.com
సృజనాత్మక ఆలోచనలకు ప్రోత్సాహం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 10 :

సమాజానికి ఉపయోగపడే సృజనాత్మక ఆలోచనలతో ముందుకొచ్చే ప్రతి ఒక్కరినీ తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. 'కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్', ప్రముఖ నేపథ్య గాయకుడు నేమాని పార్థు ఆధ్వర్యంలో రూపొందించిన 'భాగవతామృతం' (దృశ్య-శ్రవణ పద్యకథా మాలిక) మొదటి సంచికను బంజారాహిల్స్ లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో శనివారం ఆయన లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ సమాజంలో నైతిక విలువలు, సంస్కృతి, సంప్రదాయాలు, పురాణాలు, ఇతిహాసాలపై అవగాహన తగ్గుతోందన్నారు. ఇలాంటి తరుణంలో... మన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. భాగవతంలోని పద్యాలు, వాటి అంతరార్థాన్ని పిల్లలు, యువతకు సులభంగా అర్థమయ్యేలా ఆహ్లాదకరమైన సంగీతం, ఆకట్టుకునే దృశ్యరూపకంతో "భాగవతామృతం" పేరిట అందుబాటులోకి తీసుకురావడం ఎంతో అభినందనీయమన్నారు. విజ్ఞానంతో పాటు విలువలనూ పెంపొందించే ఇలాంటి తరహా సృజనాత్మక ప్రయోగాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. భాగవతాన్ని ప్రతి ఇంట్లో వినపడేలా చేసేందుకు కృషి చేసిన కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ నిర్వాహకులను, గాయకుడు నేమాని పార్థును మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో గనుల శాఖ ప్రత్యేక అధికారి బీఆర్వీ సుశీల్ కుమార్, భోగరాజు మూర్తి, పార్థు నేమాని తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें