Wednesday14 October 2026హైదరాబాద్

SENSEX72,782+1.66%
NIFTY22,623+1.76%
HYD 22K₹1,34,507/10g-2.34%
भाषाएँ

Latest News

భవిష్యత్ లో తీవ్రమైన సంక్షోభం ఎదుర్కోవాల్సిన ప్రమాదం ప్రజలకు అవగాహన కల్పించాలి

nagendra11 October 2026, 1:48 AM0 व्यूtrinetnews.com
భవిష్యత్ లో తీవ్రమైన సంక్షోభం ఎదుర్కోవాల్సిన ప్రమాదం ప్రజలకు అవగాహన కల్పించాలి

Share this story

Share link keeps your language (?lang=)

ఎల్‌నినో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు

పకడ్బందీ యాక్షన్ ప్లాన్ రూపొందించాలి సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 10:

ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో భవిష్యత్ లో తీవ్రమైన సంక్షోభం ఎదుర్కోవాల్సిన ప్రమాదం పొంచి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఇప్పటి నుంచి వచ్చే జూన్ వరకు తాగు నీరు, సాగు నీరు, వ్యవసాయం, విద్యుత్ సమస్యల విషయంలో సరైన యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సిందని అధికారులకు సూచించారు.

ఎల్‌నినో ప్రభావంతో రాబోయే సంక్షోభాన్ని ముందుగా గుర్తించకపోతే భవిష్యత్ లో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని సీఎం హెచ్చరించారు. ఎల్‌నినో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని రకాల ముందస్తు చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేయండి అధికారులను ఆదేశించారు. విద్యుత్ సమస్య తీవ్రతరమయ్యే ప్రమాదం పొంచి ఉందని,

విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉందన్నారు. కానీ .. మార్కెట్ లో విద్యుత్ అందుబాటులో లేదన్నారు. అందుకే అందుబాటులో ఉన్న విద్యుత్ ను పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

విద్యుత్ ఆధారిత పనులను సాధ్యమైనంత వరకు తాత్కాలికంగా వాయిదా వేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని,

కోవిడ్సంక్షోభంలా.. ఎల్‌నినో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు

పకడ్బందీ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ కార్యాచరణలో ప్రజలను భాగస్వాములను చేయాలని, ఎల్‌నినో ప్రభావంపై సినిమా, మీడియా, కళాజాతలతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలకు అవగాహన కల్పించాలని.

భవిష్యత్ లో నీటి సమస్య తీవ్రతరం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. చుక్క నీరు కూడా వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.

यह भी पढ़ें