Wednesday14 October 2026హైదరాబాద్

SENSEX72,782+1.66%
NIFTY22,623+1.76%
HYD 22K₹1,34,736/10g-2.17%
भाषाएँ

Latest News

పండుగలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని, ఇవి మన సాంప్రదాయాలను గుర్తు చేస్తాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

nagendra12 October 2026, 1:55 AM0 व्यूtrinetnews.com
పండుగలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని, ఇవి మన సాంప్రదాయాలను గుర్తు చేస్తాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

Share this story

Share link keeps your language (?lang=)

హైద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్,11.పండుగలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని, ఇవి మన సాంప్రదాయాలను గుర్తు చేస్తాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం రాత్రి బన్సీలాల్ పేట డివిజన్ లోని ఐ డి హెచ్ కాలనీలో గల అవర్ లేడీ ఆఫ్ హెల్త్ చాపెల్ చర్చిలో నిర్వహించిన ఫీస్ట్ ఫెస్టివల్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 నుండి 10 వ తేదీ వరకు ఈ ఫెస్టివల్ ను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. చివరి రోజున మేరీమాత ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. మనకు పండుగలు అనేకం ఉన్నా క్రిస్మస్ మాత్రం ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 న ప్రపంచ వ్యాప్తంగా నెలరోజుల పాటు జరుపుకోవడం జరుగుతుందని గుర్తు చేశారు. క్రైస్తవులు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి ప్రార్ధనలు చేయడం, చర్చిలో ఫాదర్ చెప్పే సూక్తులు ఎంతో శ్రద్ధగా వినడం జరుగుతుందని అన్నారు. దీంతో భక్తిభావం, క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. కార్యక్రమంలో పాదర్ ప్రతాప్, పాదర్ నవీన్ కుమార్, అధ్యక్షుడు జోసఫ్ సన్నీ, ప్రధాన కార్యదర్శి పాదర్ రాజు, ఉపాధ్యక్షుడు శశిరాజ్, ఆంథోని, ప్రాన్సిస్ జేవియర్, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు కొత్తూరు వెంకట్, గజ్జెల శ్రీనివాస్, వెంకటరమణ, సురేష్, వినోద్, ప్రేమ్ కుమార్, కుమార్ యాదవ్, దేశపాక శ్రీనివాస్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें