Wednesday14 October 2026Hyderabad

SENSEX72,782+1.66%
NIFTY22,623+1.76%
HYD 22K₹1,34,507/10g-2.34%
Languages

Latest News

సింగరేణి కార్మిక గర్జన సభను విజయవంతం చేయండి

nagendra13 October 2026, 10:36 AM0 viewstrinetnews.com
సింగరేణి కార్మిక గర్జన సభను విజయవంతం చేయండి

Share this story

Share link keeps your language (?lang=)

అక్టోబర్ 14న సభకు ముఖ్య అతిథిగా కేటీఆర్

ఓసీపీ–3 ఎస్‌అండ్‌డీ సెక్షన్‌లో కార్మికులకు నాయకుల పిలుపు

గోదావరిఖని, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 12: ఈ నెల 14న బుధవారం గోదావరిఖనిలో నిర్వహించనున్న ‘సింగరేణి కార్మిక గర్జన’ బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు. సభకు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్) ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు.

సభను పురస్కరించుకొని సోమవారం ఓసీపీ–3 ఎస్‌అండ్‌డీ సెక్షన్‌లో కార్మికులను కలిసిన నాయకులు సభ ప్రాధాన్యతను వివరించారు. ప్రతి కార్మికుడు హాజరై సభ విజయవంతానికి కృషి చేయాలని కోరారు.

ఈ సభను సింగరేణి భవిష్యత్తు, కార్మికుల ప్రయోజనాలపై చర్చించే వేదికగా చూడాలని నాయకులు పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత, కార్మికుల హక్కులు, పెండింగ్ సమస్యల పరిష్కారం, సంస్థ భవిష్యత్తు ప్రతి సింగరేణి కుటుంబానికి సంబంధించిన అంశాలని తెలిపారు. పార్టీలు, యూనియన్లకు అతీతంగా కార్మిక ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ సభలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

సింగరేణి సంస్థ బలంగా ఉంటేనే కార్మికుల భవిష్యత్తు భద్రంగా ఉంటుందని, కార్మికులు ఐక్యంగా నిలిస్తేనే హక్కుల సాధనకు మరింత బలం చేకూరుతుందని నాయకులు అన్నారు.

కార్యక్రమంలో కేంద్ర కమిటీ నాయకులు చంద్రయ్య, బొడ్డు రమేష్, నరేష్, ప్రాజెక్టు కార్యదర్శి మామిడి తిరుపతి, బ్రాంచి కార్యదర్శులు అనిల్ రెడ్డి, హరిప్రసాద్, మార్క్ నరేష్, పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి గెల్లు సదయ్యతోపాటు ప్రభాకర్ రెడ్డి, యోగేష్, నన్నువల రాకేష్, అశోక్, మామిడి వెంకటేష్, కర్నే రవి, ప్రకాష్, ప్రేమ్, సాయిచంద్, మల్లేష్, సతీష్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also read