Wednesday14 October 2026Hyderabad

SENSEX72,782+1.66%
NIFTY22,623+1.76%
HYD 22K₹1,34,507/10g-2.34%
Languages

Latest News

ర్యాడిక్స్ సినిమాస్ బ్యానర్ నిర్మిస్తున్న "గోల్డ్ స్పాట్" మూవీ ఫస్ట్ సింగిల్ 'పరిచయమే..' రిలీజ్

nagendra14 October 2026, 1:16 AM0 viewstrinetnews.com
ర్యాడిక్స్ సినిమాస్ బ్యానర్ నిర్మిస్తున్న "గోల్డ్ స్పాట్" మూవీ ఫస్ట్ సింగిల్ 'పరిచయమే..' రిలీజ్

Share this story

Share link keeps your language (?lang=)

ర్యాడిక్స్ సినిమాస్ బ్యానర్ నిర్మిస్తున్న కొత్త మూవీ "గోల్డ్ స్పాట్". ఈ చిత్రాన్ని విజయకృష్ణ లింగమనేని ప్రెజెంట్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ రవితేజ పచ్చిపాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్, కాజల్ చౌదరి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు దుష్యంత్ కటికనేని ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. శ్రీ చౌదరి ఇనగంటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దుష్యంత్ దగ్గర వర్క్ చేసిన వేణు కార్తికేయన్ "గోల్డ్ స్పాట్" సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్ర మ్యూజికల్ ప్రమోషన్స్ బిగిన్ చేశారు.

ఈ రోజు "గోల్డ్ స్పాట్" సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'పరిచయమే..' రిలీజ్ చేశారు. ఈ బ్యూటిఫుల్ మెలొడీని మ్యూజిక్ డైరెక్టర్ నరేన్ రెడ్డి కంపోజ్ చేసి సింగర్ తుషార నిలయతో కలిసి పాడారు. భార్గవ కార్తీక్ క్యాచీ లిరిక్స్ అందించారు. 'పరిచయమే..' సాంగ్ ఎలా ఉందో చూస్తే - 'ఓ మనసా అలుపే రాదు తలపున నీవుంటే, ఓ మనసా అదుపే లేదు ఎదురుగ నీవుంటే, వేల వర్ణాల ఆమనిగా పూల గంధాల పుష్యమిగా, పరిచయమే చిరు కథగా మొదలవగా, పరిణయమే తదుపరిగా మిగిలెనుగా, పరిచయమే చిరు కథగా మొదలవగా, పరిణయమే తదుపరిగా మిగిలెనుగా....' అంటూ ప్రేమికులవుతున్న చిన్ననాటి స్నేహితులు రామ్, శాంత మధ్య స్వీట్ మెలొడీగా చిత్రీకరించిన ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

ఇప్పటికే రిలీజ్ చేసిన "గోల్డ్ స్పాట్" సినిమా గ్లింప్స్ మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షించి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

నటీనటులు - అభిషేక్, కాజల్ చౌదరి, తదితరులు

టెక్నీషియన్స్

-------------------

స్టంట్స్ - ఎం.హరికృష్ణ

కాస్ట్యూమ్ డిజైనర్ - పొలసాని శ్రీ సింధు

సౌండ్ డిజైన్ - సాయి మణీందర్ రెడ్డి

ఎడిటర్ - నరేష్ అడుపా

ప్రొడక్షన్ డిజైనర్ - పవన్ కల్యాణ్ యల్లపు

డీవోపీ - మహీ రెడ్డి

మ్యూజిక్ - నరేన్ రెడ్డి

కో ప్రొడ్యూసర్ - శ్రీ చౌదరి ఇనగంటి

సమర్పణ - విజయ్ కృష్ణ లింగమనేని

ప్రొడ్యూసర్ - రవితేజ పచ్చిపాల

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - దుష్యంత్ కటికనేని

డైరెక్షన్ - వేణు కార్తికేయన్

పీఆర్ఓ - సురేష్ (ఎస్ కే మీడియా)

Also read