Wednesday14 October 2026హైదరాబాద్

SENSEX72,782+1.66%
NIFTY22,623+1.76%
HYD 22K₹1,34,507/10g-2.34%
भाषाएँ

Latest News

తెలంగాణ–హిరోషిమా మధ్య బలమైన భాగస్వామ్యంతో పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణకు కృషి చేయాలి

nagendra14 October 2026, 1:17 AM0 व्यूtrinetnews.com
తెలంగాణ–హిరోషిమా మధ్య బలమైన భాగస్వామ్యంతో పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణకు కృషి చేయాలి

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 12:

తెలంగాణ రాష్ట్రానికి, జపాన్‌లోని హిరోషిమా ప్రభుత్వానికి మధ్య పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పేర్కొన్నారు. పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన రంగాల్లో పరస్పర భాగస్వామ్యానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో హిరోషిమా ప్రభుత్వ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు, భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడులకు అనుకూలమైన రంగాల గురించి వివరించారు. తెలంగాణ అభివృద్ధి సామర్థ్యాలు, ప్రాధాన్య రంగాలు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంతర్జాతీయ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న కార్యక్రమాలను ప్రధాన కార్యదర్శి వివరించారు. ముఖ్యంగా కింది రంగాల్లో ఉన్న అవకాశాలను ప్రతినిధి బృందం దృష్టికి తీసుకువచ్చారు.

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం

తెలంగాణ విజన్ 2047లో భాగంగా, 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యాన్ని ప్రధాన కార్యదర్శి వివరించారు. ఈ లక్ష్య సాధనలో అంతర్జాతీయ పెట్టుబడులు, ఆధునిక సాంకేతికత, పారిశ్రామిక విస్తరణ, నైపుణ్యాభివృద్ధి కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే జపాన్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా పరిశ్రమలు, డేటా సెంటర్లు, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన వంటి రంగాల్లో పరస్పర అవకాశాలను అన్వేషించాలని సూచించారు.

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం

డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ కార్యక్రమంలో హిరోషిమా ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొనాలని ప్రధాన కార్యదర్శి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయడంతో పాటు, జపాన్ సంస్థలతో దీర్ఘకాలిక భాగస్వామ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.

తెలంగాణ, హిరోషిమా మధ్య సన్నిహిత సంబంధాలు రెండు ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి, సాంకేతిక సహకారానికి, యువతకు నూతన ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడతాయని ప్రధాన కార్యదర్శి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, టీజీఐఐసీ

డైరెక్టర్ ఎండీ శశాంక, తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें