బుధవారం14 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,782+1.66%
NIFTY22,623+1.76%
22K₹1,34,841/10g-2.10%
భాషలు

తాజా వార్తలు

ఎల్‌నినో ప్రభావాలపై రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయం నుంచి రైతు వేదికల ద్వారా రైతులతో నేరుగా అనుసంధానం

nagendra14 October 2026, 1:18 AM0 చూసులుtrinetnews.com
ఎల్‌నినో ప్రభావాలపై రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయం నుంచి రైతు వేదికల ద్వారా రైతులతో నేరుగా అనుసంధానం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

  • హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 12:

ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు, వర్షపాతం లోటు, వ్యవసాయ రంగంపై సంభావ్య ప్రభావాలను సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సంబంధిత మంత్రి పాల్గొంటున్నారు. రైతు వేదికల ద్వారా రైతులతో నేరుగా అనుసంధానమై, క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు, ఎల్‌నినో ప్రభావాలను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చిస్తున్నారు.

వర్షపాతం పరిస్థితులు, పంటల సాగు, నీటి లభ్యత, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, రైతులకు అవసరమైన వ్యవసాయ సూచనలు, ముందస్తు అవగాహన కల్పించడం వంటి అంశాలపై సమీక్షిస్తున్నారు.

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు తగిన మార్గదర్శకాలు అందిస్తూ, వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ప్రధాన కార్యదర్శి సూచించారు

ఇవి కూడా చదవండి