Wednesday14 October 2026Hyderabad

SENSEX72,782+1.66%
NIFTY22,623+1.76%
HYD 22K₹1,34,507/10g-2.34%
Languages

Latest News

తెలంగాణ మౌలిక వసతుల అభివృద్ధికి కీలక ముందడుగు గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేక భేటీ.. పలు ప్రాజెక్టులకు ఆమోదం

nagendra14 October 2026, 1:30 AM0 viewstrinetnews.com
తెలంగాణ మౌలిక వసతుల అభివృద్ధికి కీలక ముందడుగు గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేక భేటీ.. పలు ప్రాజెక్టులకు ఆమోదం

Share this story

Share link keeps your language (?lang=)

  1. న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 13:

తెలంగాణలో రహదారులు, రవాణా వ్యవస్థ, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో న్యూఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణలో చేపట్టనున్న పలు కీలక రహదారి, మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే పలు ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కీలకమైన ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణ సమయం ఆదా కానుంది.

కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి

కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన ప్రతిపాదనకు కూడా గడ్కరీ ఆమోదం తెలిపారు. జాతీయ రహదారి 167కే (NH-167K) మీదుగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అనుసంధానాన్ని మెరుగుపరిచే ఈ వంతెనతో రవాణా సౌకర్యాలు విస్తరించడంతో పాటు పర్యాటక రంగానికి ఊతం లభించనుంది.

హైదరాబాద్–శ్రీశైలం రహదారిపై ఎలివేటెడ్ కారిడార్

హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారి 765 (NH-765)పై ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి స్పందించారు. ఈ ప్రతిపాదనకు సంబంధించి నూతన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్ ) సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణకు ఐదు రోప్‌వేలు

కేంద్ర ప్రభుత్వ పర్వతమాల పథకం కింద తెలంగాణలో ఐదు రోప్‌వేల ఏర్పాటుకు గడ్కరీ ఆమోదం తెలిపినట్లు మంత్రి పేర్కొన్నారు. దీంతో పర్యాటక ప్రాంతాలకు రవాణా సదుపాయాలు మెరుగుపడటంతో పాటు పర్యాటక అభివృద్ధికి అవకాశాలు పెరగనున్నాయి.

హైదరాబాద్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై సానుకూల స్పందన

హైదరాబాద్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ ప్రతిపాదనపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ రహదారి నిర్మాణం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయనుంది.

మూడు ఆర్ఓబీలకు ఆమోదం.. 34 పనులకు

సీఆర్ఐఎఫ్ నిధుల విజ్ఞప్తి

సేతు బంధన్ పథకం కింద తెలంగాణలో మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జిల (ఆర్ఓబీ) నిర్మాణానికి కేంద్ర మంత్రి ఆమోదం తెలిపారు. అలాగే రాష్ట్రంలో చేపట్టాల్సిన 34 అభివృద్ధి పనులకు కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద నిధులు మంజూరు చేయాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఈ ప్రతిపాదనపై స్పందించిన గడ్కరీ, సంబంధిత కేంద్ర అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని విజ్ఞప్తి

తెలంగాణలోని పుల్లూరు–అలంపూర్–జట్రపోలు–పెంట్లవెల్లి–కొల్లాపూర్–లింగాల–అచ్చంపేట–డిండి–దేవరకొండ–మల్లేపల్లి–నల్గొండ మార్గాల్లోని రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని మంత్రి కోమటిరెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. ఈ ప్రతిపాదనలపై గడ్కరీ సానుకూలంగా స్పందించారు.

ఇండియన్ రోడ్ కాంగ్రెస్‌కు గడ్కరీకి ఆహ్వానం

హైదరాబాద్‌లో నవంబర్ 19 నుంచి 22 వరకు జరగనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ ) సమావేశాలకు హాజరు కావాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై సానుకూలంగా స్పందించారు

Also read