Wednesday14 October 2026Hyderabad

SENSEX72,782+1.66%
NIFTY22,623+1.76%
HYD 22K₹1,34,507/10g-2.34%
Languages

Latest News

విమాన ప్రయాణంలో పోస్టుకార్డుల పలకరింపు ఇండియా పోస్ట్‌, ఇండిగో సంయుక్తంగా ‘డిజిటల్‌ డీటాక్స్‌’ కార్యక్రమం

nagendra14 October 2026, 1:43 AM0 viewstrinetnews.com
విమాన ప్రయాణంలో పోస్టుకార్డుల పలకరింపు ఇండియా పోస్ట్‌, ఇండిగో సంయుక్తంగా ‘డిజిటల్‌ డీటాక్స్‌’ కార్యక్రమం

Share this story

Share link keeps your language (?lang=)

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 13: డిజిటల్‌ ప్రపంచంలో చేతిరాత లేఖల ఆనందాన్ని మళ్లీ పరిచయం చేసేందుకు ఇండియా పోస్ట్‌, ఇండిగో విమానయాన సంస్థ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించాయి. జాతీయ తపాలా వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్‌ 12న తపాలా బిళ్లల సేకరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘డిజిటల్‌ డీటాక్స్‌’ కార్యక్రమాన్ని చేపట్టాయి.

సుమారు 30 వేల అడుగుల ఎత్తులో విమాన ప్రయాణం చేస్తున్న ప్రయాణికులను డిజిటల్‌ పరికరాలకు కొంత విరామమిచ్చి, తమ ఆలోచనలను పోస్టుకార్డులపై రాసేందుకు ప్రోత్సహించారు. ఆత్మీయులకు చేతిరాత సందేశాలు రాయడం ద్వారా అనుబంధాలను బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ ఈ కార్యక్రమాన్ని ఇండిగో సహకారంతో నిర్వహించింది.

తెరలతో గడిపే సమయానికి విరామమిస్తూ, మనసులోని భావాలను కాగితంపై వ్యక్తీకరించే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పించారు. చేతిరాత లేఖల ప్రత్యేకతను గుర్తుచేస్తూ, మానవ సంబంధాల్లో ఆత్మీయతను పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యం. జాతీయ తపాలా వారోత్సవాలు అక్టోబర్‌ 9 నుంచి 15 వరకు కొనసాగుతున్నాయి.

Also read