బుధవారం14 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,782+1.66%
NIFTY22,623+1.76%
22K₹1,34,841/10g-2.10%
భాషలు

తాజా వార్తలు

భారత్‌–చెక్‌ రక్షణ పారిశ్రామిక సహకారం విస్తరణ రాజ్‌నాథ్‌ సింగ్‌తో చెక్‌ ఉప ప్రధాని కారెల్‌ హవ్లిచెక్‌ భేటీ

nagendra14 October 2026, 1:46 AM0 చూసులుtrinetnews.com
భారత్‌–చెక్‌ రక్షణ పారిశ్రామిక సహకారం విస్తరణ రాజ్‌నాథ్‌ సింగ్‌తో చెక్‌ ఉప ప్రధాని కారెల్‌ హవ్లిచెక్‌ భేటీ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 13:

భారత్‌, చెక్‌ రిపబ్లిక్‌ మధ్య రక్షణ పారిశ్రామిక సహకారాన్ని మరింత విస్తరించాలని ఇరు దేశాలు అంగీకరించాయి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం న్యూఢిల్లీలో చెక్‌ రిపబ్లిక్‌ మొదటి ఉప ప్రధాని, పరిశ్రమలు–వాణిజ్య శాఖ మంత్రి కారెల్‌ హవ్లిచెక్‌తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య రక్షణ పారిశ్రామిక సహకారానికి సంబంధించిన వివిధ అంశాలను సమీక్షించారు. ప్రస్తుతం కొనసాగుతున్న భాగస్వామ్యాలు, విజయవంతంగా ఏర్పాటైన పలు సంయుక్త సంస్థలపై ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.

‘మేక్‌ ఇన్‌ ఇండియా’, ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ కార్యక్రమాలను ప్రోత్సహించేలా భారత్‌–చెక్‌ సంయుక్త రక్షణ కమిటీ ఆధ్వర్యంలోనూ సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి