బుధవారం14 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,782+1.66%
NIFTY22,623+1.76%
22K₹1,34,716/10g-2.19%
భాషలు

తాజా వార్తలు

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చేతుల మీదుగా వరుణ్ సందేశ్, శ్వేతా బసుప్రసాద్ ఆహా ఒరిజినల్ "నా వైఫ్ మిస్సింగ్" నుంచి 'అరెరే వినవా..' సాంగ్ రిలీజ్

nagendra14 October 2026, 2:00 AM0 చూసులుtrinetnews.com
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చేతుల మీదుగా వరుణ్ సందేశ్, శ్వేతా బసుప్రసాద్ ఆహా ఒరిజినల్ "నా వైఫ్ మిస్సింగ్" నుంచి 'అరెరే వినవా..' సాంగ్ రిలీజ్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ఈ నెల 22న ప్రీమియర్ కు వస్తున్న "నా వైఫ్ మిస్సింగ్" వెబ్ సిరీస్

ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ కంటెంట్ తో సబ్ స్క్రైబర్స్ ను ఎంగేజ్ చేస్తోన్న ఆహా ఓటీటీ ఇప్పుడు మరో ఎగ్జైటింగ్ సిరీస్ ను మన ముందుకు తీసుకొస్తోంది. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రధాన పాత్రల్లో ఆహా ఒరిజినల్ "నా వైఫ్ మిస్సింగ్" ఈ నెల 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సిరీస్ తెలుగుతో పాటు తమిళంలోనూ సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులో ఉండనుంది. "నా వైఫ్ మిస్సింగ్" సిరీస్ ను లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్ పై శివ కంఠంనేని నిర్మించారు. స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహించారు.

ఈ రోజు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చేతుల మీదుగా "నా వైఫ్ మిస్సింగ్" నుంచి 'అరెరే వినవా..' సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ - నా వైఫ్ మిస్సింగ్ అనే టైటిల్ తోనే ఈ సినిమా చూడాలనే ఆసక్తి కలుగుతోంది. అరెరే వినవా పాట చాలా బాగుంది. సాయి కార్తీక్ ఈ పాటను ఆకట్టుకునేలా కంపోజ్ చేశారు. స్వాతి ఈ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమవుతోంది. ప్రొడ్యూసర్ శివకంఠంనేని ఆయన స్నేహితులు అందరికీ ఈ సినిమా పెద్ద విజయం అందివ్వాలని కోరుకుంటున్నా. అలాగే ఆహా కూడా ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీస్ ను ఎంకరేజ్ చేయాలి. అన్నారు.

ఈ పాటకు సాయి కార్తీక్ బ్యూటిఫుల్ ట్యూన్ కంపోజ్ చేయగా, అనురాగ్ కులకర్ణి అంతే అందంగా పాడారు. శ్రీ సాయి కిరణ్ క్యాచీ లిరిక్స్ అందించారు. 'అరెరే వినవా..' ఎలా ఉందో చూస్తే - 'అరెరే వినవా కదిలే కలవా ఏ పేరుతో నిన్ను పిలవాలమ్మా, జరిగే కథవా ఎదురే పడవా ఏ చోట నిన్ను వెతకాలమ్మా, నేనంటే నేను లేనంటే లేను తొలిసారి నిన్ను చూడంగానే, నా ఊహల్లోను నా ఆశల్లోను అందంగా దాచుకుంటున్నానే..' అంటూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట.

నటీనటులు - వరుణ్ సందేశ్, శ్వేతా బసుప్రసాద్, ప్రవీణ్, సత్య శ్రీ, తదితరులు

టెక్నీషియన్స్

---------------------

ఎడిటర్ - సాయిబాబు తలారి

డీవోపీ - ఎన్.ఎస్. సతీష్ కుమార్

మ్యూజిక్ - సాయి కార్తీక్

స్టోరీ - ఉమర్జీ అనురాధ

క్రియేటెడ్ బై - శ్రీనివాస్ మండల

బ్యానర్ - లైట్ హౌస్ సినీ మ్యాజిక్

ప్రొడ్యూసర్ - శివ కంఠంనేని

డైరెక్టర్ - స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ

పీఆర్ఓ - సురేష్ (ఎస్ కే మీడియా)

ఇవి కూడా చదవండి