Wednesday14 October 2026Hyderabad

SENSEX72,782+1.66%
NIFTY22,623+1.76%
HYD 22K₹1,34,507/10g-2.34%
Languages

Latest News

లలిత కళా తోరణంలో నాలుగో రోజు నానబియ్యం బరవీంద్రభారతిలో నాలుగవ రోజు 'నాన బియ్యం బతుకమ్మ' వేడుకలు తెలంగాణ జీవన విధానానికి, ప్రకృతి ఆరాధనకు నిదర్శనం బతుకమ్మ - -శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి

రాధా రాణి బృందం మధుర గీతాల మాల తెలంగాణ జీవన విధానానికి, ప్రకృతి ఆరాధనకు నిదర్శనం బతుకమ్మ - -శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి

nagendra14 October 2026, 2:10 AM1 viewstrinetnews.com
లలిత కళా తోరణంలో నాలుగో రోజు నానబియ్యం బరవీంద్రభారతిలో నాలుగవ రోజు 'నాన బియ్యం బతుకమ్మ' వేడుకలు తెలంగాణ జీవన విధానానికి, ప్రకృతి ఆరాధనకు నిదర్శనం బతుకమ్మ - -శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి

Share this story

Share link keeps your language (?lang=)

రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్అక్టోబర్ 13 :

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలు రవీంద్రభారతిలో మంగళవారం నాలుగవ రోజు నాన బియ్యం బతుకమ్మ పేరిట అత్యంత వైభవంగా సాగాయి. ఈ వేడుకల్లో మహిళలు డప్పులతో సప్పుడుతో పాల్గొని, రంగురంగుల తంగేడు, గునుగు పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ కోలాటాలు ఆడుతూ, సాంప్రదాయ పాటలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా.ఏనుగు నరసింహారెడ్డి ఐఏఎస్ హాజరై ప్రసంగించారు. ప్రకృతితో మమేకమై, పూలనే దైవంగా భావించి పూజించే అరుదైన సాంస్కృతిక మహోత్సవం బతుకమ్మ అని ఆయన కొనియాడారు. "మన సంస్కృతి, సాంప్రదాయాలు మరియు మానవీయ విలువలను తరతరాలకు అందించడంలో ఈ పండుగ కీలక పాత్ర పోషిస్తుంది. సమిష్టితత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి బతుకమ్మ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయి" అని పేర్కొన్నారు.

నానబెట్టిన బియ్యం, బెల్లం నైవేద్యంగా సమర్పించే ఈ నాలుగో రోజు సంబరాల్లో మహిళలతో పాటు చిన్నారులు, కళాకారులు, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు విశేషంగా పాల్గొని భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య వేడుకలను జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో శాఖ సిబ్బంది పాల్గొన్నారు.తుకమ్మ వేడుకలు:

Also read

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై జనసేనలో ఆసక్తికర చర్చ.. పవన్ సన్నిహిత పారిశ్రామికవేత్తకు అవకాశం దక్కేనా? కూటమితో సంబంధం లేకుండా సొంతంగా పోటీ చేసే యోచనలో జనసేన? తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా వ్యూహరచన!

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై జనసేనలో ఆసక్తికర చర్చ.. పవన్ సన్నిహిత పారిశ్రామికవేత్తకు అవకాశం దక్కేనా? కూటమితో సంబంధం లేకుండా సొంతంగా పోటీ చేసే యోచనలో జనసేన? తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా వ్యూహరచన!

Read more →