Wednesday14 October 2026హైదరాబాద్

SENSEX72,782+1.66%
NIFTY22,623+1.76%
HYD 22K₹1,34,348/10g-2.45%
भाषाएँ

Latest News

కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ రాజీనామా ఊహాగానాలు ఊతం

nagendra14 October 2026, 2:12 AM0 व्यूtrinetnews.com
కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ రాజీనామా ఊహాగానాలు ఊతం

Share this story

Share link keeps your language (?lang=)

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 13 :

కేంద్ర మంత్రివర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ

ఊహాగానాల నడుమ కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తమిళనాడులో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తనను పూర్తిగా రాష్ట్ర రాజకీయాలకే పరిమితం చేయాలని ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.

ప్రధాని మోదీకి తన రాజీనామా లేఖను సమర్పించిన ఎల్. మురుగన్.. కేంద్ర కేబినెట్‌లో తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడులో పార్టీని క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా శక్తివంతం చేయడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. రాబోయే రాజకీయ పరిణామాలు, ఎన్నికల వ్యూహాల నేపథ్యంలో తమిళనాడులో బీజేపీ జెండాను ఎగరవేయడానికి, పార్టీని గ్రామస్థాయిలో ప్రజలకు చేరువ చేయడానికి రాష్ట్ర బాధ్యతలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. తనకు కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా పనిచేసే అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, జాతీయ నాయకత్వానికి మురుగన్ ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తాను సంతృప్తికరంగా పనిచేశానని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పదవికి వీడ్కోలు పలికిన ఎల్. మురుగన్ త్వరలోనే పూర్తిగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్లి పార్టీ బలోపేతం కోసం సుడిగాలి పర్యటనలు చేయనున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

यह भी पढ़ें

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై జనసేనలో ఆసక్తికర చర్చ.. పవన్ సన్నిహిత పారిశ్రామికవేత్తకు అవకాశం దక్కేనా? కూటమితో సంబంధం లేకుండా సొంతంగా పోటీ చేసే యోచనలో జనసేన? తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా వ్యూహరచన!

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై జనసేనలో ఆసక్తికర చర్చ.. పవన్ సన్నిహిత పారిశ్రామికవేత్తకు అవకాశం దక్కేనా? కూటమితో సంబంధం లేకుండా సొంతంగా పోటీ చేసే యోచనలో జనసేన? తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా వ్యూహరచన!

और पढ़ें →