హైదారాబాద్ , ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 13:
ప్రఖ్యాత సినీ గీత రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించిన ఎన్నో గీతాలను రాధా రాణి సహా గాయనీ గాయకులతో కలిసి పాడి శ్రీతల ను పులకితుల చేశారు శ్రీ త్యాగరాయ గానసభ లోని కళా సుబ్బారావు కళా వేదిక పై రాధా రాణి ఆర్ట్స్ అండ్ మ్యూజికల్స్ నిర్వహణలో వరాల తెలుగు ఒకటేనన్న శీర్షికన సినారె మధుర సినీ గీతాల మాల గా జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు మాట్లాడుతూ రాధా రాణి గళం లో మాధుర్యం ఉందని ఆమె సుశీల జానకి లీల వంటి నేపథ్య గాయనీ మణులు స్వరం బాగా అనుకరించగలదు అని అభినందించారు ప్రముఖ గాయకుడు త్రినాథ రావు శుభాకాంక్షలు తెలిపారు





