శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

అక్టోబర్ 16న రానున్న విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’

Vijay Antony's upcoming father-sentiment drama 'Naanna Kutti', directed by Mu. Maran, is set for a grand theatrical release on October 16 for Dasara.

nagendra24 September 2026, 7:28 PM12 చూసులుtrinetnews.com
అక్టోబర్ 16న రానున్న విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

కంటెంట్ బేస్డ్ చిత్రాల్ని చేస్తూ విజయ్ ఆంటోని తనకంటూ ఓ మంచి బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు. అలాంటి విజయ్ ఆంటోని ప్రస్తుతం ‘నాన్న కుట్టి’ అంటూ ఆడియెన్స్ ముందుకు రానున్నారు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో ము. మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా చేస్తున్న చిత్రం ‘నాన్న కుట్టి’. యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, ఇంటెన్స్ డ్రామాగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద మీరా విజయ్ ఆంటోని నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీకి సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ అధినేత రామంజనేయులు జవ్వాజీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. దసరా సందర్భంగా ఈ మూవీని అక్టోబర్ 16న విడుదల చేయబోతోన్నారు. దసరా సెలవులు కలిసి వచ్చేలా ఈ మూవీ రిలీజ్‌ని ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లను గమనిస్తే.. ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌ని ప్రధానంగా చూపించబోతోన్నారని అర్థం అవుతోంది.

ఈ చిత్రంలో ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్, చిత్ర లక్ష్మణన్, శ్రీజ రవి, వెట్టై ముత్తుకుమార్, జెన్సన్ దివాకర్, మురుగానందం, మున్నార్ రమేష్, లిస్సీ ఆంటోని, కుమార్ నటరాజన్, విజయన్, ప్రవీణ, హరిత, హరిప్రియ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.

రాజీవ్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేయగా, విజయ్ ఆంటోనీ సంగీతం అందించడంతో పాటు ఎడిటర్‌గా కూడా వ్యవహరించారు. ఎ. రాజా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వర్తించారు.

యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, భావోద్వేగ కథనం, హృద్యమైన సంగీతం, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో ‘నాన్న కుట్టి’ చిత్రం రానుంది. అక్టోబర్ 16న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

తారాగణం : విజయ్ ఆంటోని, ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్, చిత్ర లక్ష్మణన్, శ్రీజ రవి, వెట్టై ముత్తుకుమార్, జెన్సన్ దివాకర్, మురుగానందం, మున్నార్ రమేష్, లిస్సీ ఆంటోని, కుమార్ నటరాజన్, విజయన్, ప్రవీణ, హరిత, హరిప్రియ తదితరులు

సాంకేతిక సిబ్బంది:

రచయిత & దర్శకుడు: ము. మారన్

నిర్మాత: మీరా విజయ్ ఆంటోని

సహ నిర్మాత: సర్వంత్ రామ్ క్రియేషన్స్ (రామాంజనేయులు జవ్వాజి)

సంగీతం: విజయ్ ఆంటోని

సినిమాటోగ్రఫీ: రాజీవ్ రాజేంద్రన్

ఎడిటర్: విజయ్ ఆంటోని

ప్రొడక్షన్ డిజైనర్: ఎ రాజా

కాస్ట్యూమ్స్: జి అనూష మీనాక్షి

PRO: సాయి సతీష్

ఇవి కూడా చదవండి

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →