గురువారం22 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX73,710+1.27%
NIFTY22,811+0.83%
22K₹1,34,618/10g-0.72%
భాషలు
Sign in

జాతీయ వార్తలు

భారత్‌లోనూ ప్రభుత్వ మార్పు కుట్రలు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

భారత్‌లోనూ ప్రభుత్వ మార్పు కుట్రలు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: భారత్‌లోనూ ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత

Staff Reporter21 October 2026, 4:15 AM5 చూసులుtrinetnews.com
భారత్‌లోనూ ప్రభుత్వ మార్పు కుట్రలు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

భారత్‌లోనూ ప్రభుత్వ మార్పు కుట్రలు: ఆర్ఎస్ఎస్ చీఫ్

మోహన్ భగవత్

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: భారత్‌లోనూ ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్, ఫ్రాన్స్, నేపాల్‌లలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ, ఇలాంటి ప్రయత్నాలు భారత్‌లోనూ కొనసాగుతున్నాయని ఆరోపించారు. అయితే, దేశంలో ప్రభుత్వ మార్పు జరగదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాగ్‌పూర్‌లో మంగళవారం నిర్వహించిన ఆర్ఎస్ఎస్ విజయదశమి కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ అభివృద్ధి చెందడం, అంతర్జాతీయంగా బలమైన దేశంగా ఎదగడం కొన్ని శక్తులకు ఇష్టం లేదని మోహన్ భగవత్ అన్నారు. దేశాన్ని, హిందూ సమాజాన్ని, ఆర్ఎస్ఎస్‌ను బలహీనపరిచేందుకు కొన్ని శక్తులు ప్రణాళికలు రచిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కొందరు రాజకీయ నాయకులు కూడా అధికారంపై ఆశతో ఇలాంటి ప్రయత్నాలకు తోడ్పడుతున్నారని ఆరోపించారు. ఫ్రాన్స్‌లో జరిగిన నిరసనలు, బంగ్లాదేశ్, నేపాల్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ, పాశ్చాత్య దేశాల నుంచి వస్తున్న ప్రభావాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశంలో సమస్యలు తలెత్తినప్పుడు ప్రజలు ఉద్యమాలు చేయడం సహజమని భగవత్ అన్నారు. అయితే, ఆ ఉద్యమాలు సమస్యలకు పరిష్కారాలను కనుగొనే దిశగా సాగాలని సూచించారు. సమాజంలో ద్వేషాన్ని, విభేదాలను పెంచేలా ఉండకూడదని పేర్కొన్నారు. ఓట్ల కోసం, ప్రజాదరణ కోసం మాత్రమే ఉద్యమాలు చేపట్టడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. సమాజంలో చర్చలు, పరస్పర సంభాషణల ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభిస్తాయని అన్నారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో అలరించిన ‘సంకీర్తన స్వర సమ్మేళనం’

హైదరాబాద్‌లో అలరించిన ‘సంకీర్తన స్వర సమ్మేళనం’

అలరించిన ‘సంకీర్తన స్వర సమ్మేళనం’ హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 21: మీనాక్షి గ్రూప్ ఆబాలగోపాలం ఆధ్వర్యంలో ‘సంకీర్తన స్వర సమ్మేళనం చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు . కార్యక

మిగతా చదవండి →

జేఎల్ స్కామ్: బీఆర్ఎస్ పాలనలో 150 మంది ఫేక్ లెక్చరర్ల నియామకం?

జేఎల్ స్కామ్లో కళ్లు తిరిగే నిజాలు బీఆర్ఎస్ పాలనలో 270 మందికి ఉద్యోగాలు 150 మంది సర్టిఫికెట్లు ఫేక్! హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ ఒక్కక్కటి బహిర్గతం అవుతున్

మిగతా చదవండి →

ఎన్నికల కోడ్ నేప‌థ్యంలో ఎలాంటి సిఫార‌స్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు

ఎన్నికల కోడ్ నేప‌థ్యంలో ఎలాంటి సిఫార‌స్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు తిరుమల, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున శ్రీవారి దర్శనం, వసతి కోసం తిరుమలలో ఎలాంటి

మిగతా చదవండి →

రెబల్స్‌ నామినేషన్లు ఉపసంహరించుకోవాలి.. పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తప్పవు

రెబల్స్‌ నామినేషన్లు ఉపసంహరించుకోవాలి.. పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తప్పవు

రెబల్స్‌ నామినేషన్లు ఉపసంహరించుకోవాలి.. పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తప్పవు కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం.. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: స్థానిక

మిగతా చదవండి →