దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్
అమరావతి, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి అంతరాలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆశీర్వచన మండపంలో గవర్నర్‌కు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు దేవాదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే శీనానాయక్ అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదం, అమ్మవారి చిత్ర పటాన్ని అందజేశారు. మరో వైపు నవరాత్రులు చివరి రోజు కావడంతో దుర్గమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇంద్రకీలాద్రిపై నవరాత్రి వేడుకలు మంగళవారం ముగిసాయి.




