Thursday22 October 2026హైదరాబాద్

SENSEX73,710+1.27%
NIFTY22,811+0.83%
HYD 22K₹1,34,618/10g-0.72%
भाषाएँ
Sign in

Telangana

विद्रोही अपने नामांकन वापस लें.. पार्टी के आदेशों की अवहेलना करने पर होगी कार्रवाई

विद्रोही अपने नामांकन वापस लें.. पार्टी के आदेशों की अवहेलना करने पर होगी कार्रवाई गठबंधन के उम्मीदवारों की जीत ही लक्ष्य.. सांसदों, मंत्रियों और विधायकों को सीएम चंद्रबाबू का मार्गदर्शन अमरावती, ट्रिनेट न्यूज, अक्टूबर 20: स्थानीय

Staff Reporter21 October 2026, 4:21 AM5 व्यूtrinetnews.com
विद्रोही अपने नामांकन वापस लें.. पार्टी के आदेशों की अवहेलना करने पर होगी कार्रवाई

Share this story

Share link keeps your language (?lang=)

రెబల్స్‌ నామినేషన్లు ఉపసంహరించుకోవాలి.. పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తప్పవు

*కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం.. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

అమరావతి, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను ఆదేశించారు. రెబల్స్‌గా నామినేషన్లు వేసిన వారితో ఉపసంహరింపజేయాలని, పార్టీ అధికారికంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు త్వరగా బీ-ఫారాలు అందించాలని సూచించారు. పార్టీ నిర్ణయాలను ధిక్కరించి ముందుకు వెళ్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం అత్యంత కీలకమని, మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నప్పుడు కేటాయించిన స్థానాల్లో మిత్రపక్షాల అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్పష్టం చేశారు.

సమర్థులైన అభ్యర్థుల ఎంపికకు ప్రాధాన్యం

తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం అభ్యర్థులను నిలబెట్టవద్దని చంద్రబాబు సూచించారు. మిత్రపక్షాలతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో బలాబలాలను అంచనా వేయాలని, ప్రజల్లో గుర్తింపు ఉన్న, ప్రజలు ఆమోదించిన సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేయాలని చెప్పారు. కూటమి తరఫున సీట్లు కేటాయించిన అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత అన్ని పార్టీల నేతలపై ఉందన్నారు.

పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పించాలని సూచించారు. వేలాది మంది కార్యకర్తలకు ప్రజాసేవ చేసే అవకాశం ఈ ఎన్నికల ద్వారా లభిస్తుందని పేర్కొన్నారు. పొత్తులు, ఇతర రాజకీయ సమీకరణాల కారణంగా కొందరికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించలేకపోతే, వారికి నామినేటెడ్ పదవుల్లో స్థానం కల్పిస్తామని తెలిపారు.

ఇంటింటి ప్రచారంతో ప్రభుత్వ పనితీరును వివరించాలి

ఎన్నికల ప్రచారాన్ని క్షేత్రస్థాయి నుంచి ప్రారంభించాలని, ఇంటింటి ప్రచారం నిర్వహించి బూత్ స్థాయి వరకు ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని చంద్రబాబు ఆదేశించారు. నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ ఉంటేనే నాయకులుగా గుర్తింపు లభిస్తుందని చెప్పారు.

గ్రామాల్లో సమర్థులైన నాయకులు లేకపోతే అక్కడ పార్టీ బలహీనపడుతుందని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసే నేతలను ఎంపిక చేసుకుంటే పార్టీ మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు. ఈ నెల రోజులు పార్టీ నేతల పనితీరుకు పరీక్ష వంటివని వ్యాఖ్యానించారు.

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు, సర్పంచ్‌ పదవులకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో కూటమి మెరుగైన ఫలితాలు సాధించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన 57 శాతం స్ట్రైక్‌రేట్‌ కంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా నేతలు పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం ఎన్నికలు జరగని మున్సిపాలిటీలకు కూడా త్వరలో ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు.

ఎన్నికలు పూర్తయ్యే వరకు తాను ముఖ్యమంత్రిగానే కాకుండా పార్టీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.

అన్ని సామాజికవర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం

11 కార్పొరేషన్లను 11 సామాజికవర్గాలకు కేటాయించినట్లు చంద్రబాబు తెలిపారు. అన్ని కులాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వేలాది మందికి ప్రజాసేవ చేసే అవకాశం కల్పిస్తాయని చెప్పారు. విలువలు లేని రాజకీయం, రౌడీయిజం, అధికార దుర్వినియోగం ద్వారా చేసే రాజకీయాలు ఎన్నటికీ నిలబడవని వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసాన్ని పొందేలా నాయకులు పనిచేయాలని, పార్టీ కోసం అంకితభావంతో కృషి చేసిన వారికి తగిన గుర్తింపు లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కూటమి పార్టీల నేతలంతా సమన్వయంతో ముందుకు సాగుతూ అధికారిక అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

यह भी पढ़ें

हैदराबाद में मंत्रमुग्ध करने वाला 'संकीर्तन स्वर सम्मेलन'

हैदराबाद में मंत्रमुग्ध करने वाला 'संकीर्तन स्वर सम्मेलन'

मंत्रमुग्ध करने वाला 'संकीर्तन स्वर सम्मेलन' हैदराबाद, ट्राइनेट न्यूज, 21 अक्टूबर: मीनाक्षी ग्रुप आबालगोपालम के तत्वावधान में चिक्कड़पल्ली स्थित श्री त्यागराज गानसभा कला सुब्बा राव कला वेदिके में 'संकीर्तन स्वर सम्मेलन' आयोजित किया गया।

और पढ़ें →

वैभवपूर्वक संपन्न हुआ श्रीवारी का चक्रस्नान

वैभवपूर्वक संपन्न हुआ श्रीवारी का चक्रस्नान

वैभवपूर्वक संपन्न हुआ श्रीवारी का चक्रस्नान, चक्रधारी का दिव्य स्नान। पुष्करिणी में हज़ारों भक्तों ने किए पवित्र स्नान। लोक कल्याण और समस्त जीव-जंतुओं की भलाई के लिए पवित्र अवभृथ स्नान। तिरुपति, ट्रिनेट न्यूज़, 20 अक्टूबर:

और पढ़ें →

घट रहा है भूजल स्तर.. राज्य में चिंताजनक स्थिति

(स्टोरी) घट रहा है भूजल स्तर, राज्य में चिंताजनक स्थिति। पिछले वर्ष की तुलना में जल स्तर औसतन 5 मीटर नीचे गिरा, बढ़ रहा है पानी का उपयोग.. हैदराबाद, ट्रेनेट न्यूज, अक्टूबर 20 : राज्य में भूजल की स्थिति चिंताजनक बनी हुई है।

और पढ़ें →