Saturday10 October 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Telangana

इंडियन बैंक रिटायरीज एसोसिएशन के रजत जयंती समारोह का भव्य आयोजन

इंडियन बैंक रिटायरीज एसोसिएशन के रजत जयंती समारोह में मुख्य अतिथि के रूप में इंडियन बैंक की पूर्व एमडी व सीईओ पद्मजा चुंदूरू और विशिष्ट अतिथि के रूप में फिल्म अभिनेता तणिकेళ్ల भरणी शामिल हुए। जोंनवित्तुल रामलिंगेश्वर राव की विशेष प्रस्तुति। हैदराबाद, 3 सितंबर।

Staff Reporter30 September 2026, 9:46 AM8 व्यूtrinetnews.com
इंडियन बैंक रिटायरीज एसोसिएशन के रजत जयंती समारोह का भव्य आयोजन

Share this story

Share link keeps your language (?lang=)

ఇండియన్ బ్యాంక్ రిటైరీల సంఘం రజతోత్సవ వేడుకలు

ముఖ్య అతిథిగా ఇండియన్ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో పద్మజా చుండూరు

విశిష్ట అతిథిగా సినీ నటుడు తనికెళ్ల భరణి

జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రత్యేక ప్రదర్శన

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (ట్రైనెట్ న్యూస్): ఇండియన్ బ్యాంక్ రిటైరీల సంఘం (ఐబీఆర్‌ఏ), హైదరాబాద్ ఆధ్వర్యంలో వ్యవస్థాపక దినోత్సవం, రజతోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. కాచిగూడలోని మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహం ప్రాంగణంలోని మాడం అంజయ్య మెమోరియల్ హాల్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం జరిగింది.

ఐబీఆర్‌ఏ 25 సంవత్సరాల సేవలను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలను ఇండియన్ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పద్మజా చుండూరు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి విశిష్ట అతిథిగా పాల్గొని తన ప్రసంగంతో సభ్యుల్లో స్ఫూర్తి నింపారు.

గౌరవ అతిథులుగా ఇండియన్ బ్యాంక్ హైదరాబాద్ ఎఫ్‌జీఎం ఎం. శ్రీరామచంద్రబాబు, కిమ్స్–రెనోవా క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి.ఎస్. దత్తాత్రేయ, ఇండియన్ బ్యాంక్ హైదరాబాద్ జోనల్ మేనేజర్ కె. శ్రీనివాస్, మల్కాజిగిరి జోనల్ మేనేజర్ కె. సాయిప్రసాద్ పాల్గొన్నారు.

ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రత్యేక ప్రదర్శనలో భాగంగా కవిత్వం, హాస్య పేరడీలతో సభికులను అలరించారు. ఆయన ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా సంఘం పాతికేళ్ల ప్రస్థానాన్ని, విశ్రాంత బ్యాంకు ఉద్యోగుల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలను వక్తలు గుర్తుచేశారు. సభ్యుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, ఆరోగ్య–సంక్షేమ అంశాల్లో ఐబీఆర్‌ఏ చేస్తున్న సేవలను అభినందించారు. భవిష్యత్తులోనూ సభ్యుల మధ్య ఐక్యతను బలోపేతం చేస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. రజతోత్సవాన్ని పురస్కరించుకుని సంఘం సభ్యులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

यह भी पढ़ें

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

ఆధునిక సాంకేతిక‌త‌కు పెద్ద పీట వేయాలి కేబీఆర్ చుట్టూ మ‌రింత స‌జావుగా రాక‌పోక‌లు రీసైకిల్డ్ వాట‌ర్ వినియోగంపై పూర్తి స్థాయి అధ్య‌య‌నం క్యూర్ ప‌రిధిలో ప‌నుల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

और पढ़ें →