జేఎల్ స్కామ్లో కళ్లు తిరిగే నిజాలు
బీఆర్ఎస్ పాలనలో 270 మందికి ఉద్యోగాలు
150 మంది సర్టిఫికెట్లు ఫేక్!
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల
క్రమబద్ధీకరణ ప్రక్రియ ఒక్కక్కటి
బహిర్గతం అవుతున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో డిగ్రీ కాలేజీల్లో కూడా ఇదే నకిలీ దందా నడిచింది. రెగ్యులర్ అయిన 270 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లలో 150 మందికి పైగా చదువురాని పంతుళ్లు ఉన్నారని విశ్వాసనీయ వర్గాల సమాచారం.
నకిలీగాళ్ల ఇష్టారాజ్యం
2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 38లో డిగ్రీ కాలేజీ కాంట్రాక్ట్ లెక్చరర్ల అంశం కూడా ఉన్నది. మొత్తం 270 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లని పర్మినెంట్ చేసుకోవడానికి ఈ జీవోలో అనుమతి ఇచ్చారు. మినిమం టైమ్ స్కేల్ కింద మరో 10 మందిని పర్మినెంట్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. అనంతరం పలు ప్రత్యేక జీవోలతో 270 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. అటు మినిమ్ టేమ్ స్కేల్ కింద 9 మందిని నియమించుకున్నారు. ఇక్కడ కూడా ఫేక్ లెక్చరర్లే చక్రం తిప్పారు. చెల్లని సర్టిఫికెట్లతో శాశ్వత ఉద్యోగాలు పొంది, డిగ్రీ కాలేజీల్లో చదువులు చెబుతున్నారు. మొత్తం 150 మంది వరకూ నకిలీ లెక్చరర్లు
ఉన్నారని విశ్వాసనీయ వర్గాల సమాచారం. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం హై కోర్ట్ విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ వేసి విచారణ చేపట్టితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని విద్యార్థి సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.



