Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Telangana

नाచారం एसआई पल्ला प्रभाकर रेड्डी सेवानिवृत्त

नाచారం एसआई पल्ला प्रभाकर रेड्डी सेवानिवृत्त, 37 साल की लंबी सेवा में कई पुरस्कार और सम्मान। नाచారం, 30 सितंबर (ट्रैनेट न्यूज): नाచారం पुलिस स्टेशन में कार्यरत सब-इंस्पेक्टर पल्ला प्रभाकर रेड्डी।

Staff Reporter30 September 2026, 9:15 AM28 व्यूtrinetnews.com
नाచారం एसआई पल्ला प्रभाकर रेड्डी सेवानिवृत्त

Share this story

Share link keeps your language (?lang=)

నాచారం ఎస్సై పల్లా ప్రభాకర్‌రెడ్డి పదవీ విరమణ

37 ఏళ్ల సుదీర్ఘ సేవలో అనేక అవార్డులు, రివార్డులు

నాచారం, సెప్టెంబర్ 30 (ట్రైనెట్ న్యూస్): నాచారం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్‌ఇన్‌స్పెక్టర్ పల్లా ప్రభాకర్‌రెడ్డి 37 ఏళ్ల సుదీర్ఘ పోలీసు సేవ అనంతరం మంగళవారం పదవీ విరమణ చేశారు.

1989లో కానిస్టేబుల్‌గా పోలీసుశాఖలో చేరిన ప్రభాకర్‌రెడ్డి అంకితభావంతో విధులు నిర్వహిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. 2011లో హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన ఆయన, 2024లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందారు. గత రెండేళ్లుగా నాచారం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా సేవలందించారు.

విధి నిర్వహణలో చూపిన ప్రతిభ, నిజాయతీ, క్రమశిక్షణకు గుర్తింపుగా ఆయన తన సర్వీసులో 95 నగదు రివార్డులు, ఒక సేవా పతకం, ఒక ఉత్తమ సేవా పతకం, ఆరు ప్రశంసాపత్రాలు, 60 గుడ్ సర్వీస్ ఎంట్రీ రివార్డులు అందుకున్నారు. మాజీ డీజీపీలు పేర్వారం రాములు, సుకుమార్, మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా పలు నగదు రివార్డులు స్వీకరించారు.

ప్రభాకర్‌రెడ్డి పదవీ విరమణ సందర్భంగా నాచారం పోలీస్‌స్టేషన్ సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు. పోలీసుశాఖకు ఆయన అందించిన సేవలను కొనియాడుతూ భవిష్యత్ జీవితం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది పల్లా ప్రభాకర్‌రెడ్డికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.

यह भी पढ़ें

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

ఆధునిక సాంకేతిక‌త‌కు పెద్ద పీట వేయాలి కేబీఆర్ చుట్టూ మ‌రింత స‌జావుగా రాక‌పోక‌లు రీసైకిల్డ్ వాట‌ర్ వినియోగంపై పూర్తి స్థాయి అధ్య‌య‌నం క్యూర్ ప‌రిధిలో ప‌నుల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

और पढ़ें →