Saturday10 October 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Telangana

रिम्ज़ में नवजात शिशुओं की मौत की हो समग्र जाँच: दुंड्रा कुमारस्वामी

रिम्ज़ में नवजात शिशुओं की मौत पर समग्र जाँच की माँग, राष्ट्रीय बीसी दल के अध्यक्ष और वकील दुंड्रा कुमारस्वामी ने तेलंगाना राज्य मानवाधिकार आयोग से की शिकायत।

Staff Reporter23 September 2026, 2:44 PM16 व्यूtrinetnews.com
रिम्ज़ में नवजात शिशुओं की मौत की हो समग्र जाँच: दुंड्रा कुमारस्वामी

Share this story

Share link keeps your language (?lang=)

రిమ్స్ లో నవజాత శిశువుల మృతి.. సమగ్ర విచారణ జరపాలి

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన జాతీయ బీసీ దళ్‌ అధ్యక్షుడు, న్యాయవాది దుండ్ర కుమారస్వామి

బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం.. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 23: ఆదిలాబాద్‌ రిమ్స్ లోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం (ఎస్ఎన్సీయూ) లో సెప్టెంబర్‌ 21న చోటుచేసుకున్న అగ్ని, పొగ ఘటనలో ముగ్గురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని జాతీయ బీసీ దళ్‌ అధ్యక్షుడు, న్యాయవాది దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు. పలువురు శిశువులు అస్వస్థతకు గురై ఇతర ఆసుపత్రులకు తరలించాల్సి రావడం ఆందోళనకరమన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో అత్యవసర భద్రతా ప్రమాణాలు, విద్యుత్‌ వ్యవస్థ, ఏసీ నిర్వహణ, అగ్నిమాపక సదుపాయాలు, అత్యవసర తరలింపు ఏర్పాట్లపై ఈ ఘటన తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందన్నారు. ఘటనపై మానవ హక్కుల కోణంలో నిష్పక్షపాత, సమగ్ర విచారణ జరిపి బాధ్యత ఎవరిదో నిర్ధారించాలని, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం, అవసరమైన వైద్య సహాయం, మానసిక అండతో పాటు మృతి చెందిన శిశువుల కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ఆడిట్‌ చేపట్టాలని,

రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని దుండ్ర కుమారస్వామి డిమాండ్‌ చేశారు. అన్ని ఎస్ఎన్సీయూలు ,

ఐసీయూ లు ఇతర అత్యవసర విభాగాల్లో విద్యుత్‌ వ్యవస్థలు, ఏసీ పరికరాలు, ఫైర్‌ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, అలారాలు, బ్యాకప్‌ విద్యుత్‌, అత్యవసర తరలింపు ప్రణాళికలపై ప్రత్యేక భద్రతా ఆడిట్‌ నిర్వహించి లోపాలను వెంటనే సరిచేయాలని కోరారు. ఈ ఘటనలో ప్రాథమికంగా నిర్లక్ష్యం వహించినట్లు తేలిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, విచారణను ప్రభావితం చేయకుండా సంబంధిత బాధ్యులైన అధికారులను, ముఖ్యంగా రిమ్స్ డైరెక్టర్‌/సూపరింటెండెంట్‌ను విచారణ పూర్తయ్యే వరకు వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. నవజాత శిశువుల ప్రాణాలకు సంబంధించిన ఈ ఘటనలో బాధ్యతను తేల్చి, బాధిత కుటుంబాలకు న్యాయం చేయడం ప్రభుత్వ తక్షణ బాధ్యత అని పేర్కొన్నారు.

यह भी पढ़ें

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

ఆధునిక సాంకేతిక‌త‌కు పెద్ద పీట వేయాలి కేబీఆర్ చుట్టూ మ‌రింత స‌జావుగా రాక‌పోక‌లు రీసైకిల్డ్ వాట‌ర్ వినియోగంపై పూర్తి స్థాయి అధ్య‌య‌నం క్యూర్ ప‌రిధిలో ప‌నుల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

और पढ़ें →